మే 5న చంద్ర గ్రహణం.. ఆరోజు చేయాల్సిన పరిహారాలు
వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మే 5వ తేదీన ఏర్పడబోతోంది. గ్రహణం తులా రాశి, స్వాతి నక్షత్రాల్లో ప్రారంభమవుతుంది. గ్రహణాలను అశుభానికి సంకేతంగా పరిగణించి ఆలయాల తలుపులన్నీ మూసేస్తారు. ఎటువంటి శుభకార్యం తలపెట్టరు.
రాహువు, కేతువు పౌర్ణమి రోజు రాత్రి వేళలో చంద్రుడిని మింగేస్తారు. ఆ సమయంలో చంద్రుడు కనపడడు. చంద్ర గ్రహణం వేళ కొన్ని పరిహారాలను పాటిస్తే ఎలాంటి దుష్ఫఫలితాలు ఎదురవ్వకుండా.. జీవితంలో సంతోషంగా ముందుకు సాగొచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

చంద్ర గ్రహణం రోజు చేయాల్సిన పరిహారాలు
* తులసి ఆకులను నోటిలో వేసుకుని చంద్రుని బీజ మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. గ్రహణ సమయంలో ఈ మంత్రాలను జపించడం వల్ల ఎంతో శ్రేయోదాయకం. గ్రహణం వల్ల ఏర్పడే చెడు ప్రభావం తొలగిపోయి జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది.
* ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గ్రహణం తర్వాత ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. మంచినీటిలో కొంచెం గంగాజలం కలిపి ఆహారం తీసుకోవాలి. దీనివల్ల పేదరికం నుంచి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.
* అన్నం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రం, మిఠాయిలు.. తదితర తెల్లటి వస్తువులను దానం చేయడం శుభప్రదంగా చెబుతారు.
* వ్యాపారం పెరిగేందుకు లక్ష్మీదేవి విగ్రహం లేదంటే ఫొటో దగ్గర గోమతీ చక్రాన్ని ప్రతిష్టించాలి. పాలతో శుద్ధి చేసి దానిపై చందనం రాయాలి. పూజ అనతరం పసుపుగుడ్డలో కట్టి వ్యాపారం చేసే చోట భద్రంగా దాయాలి.
* తీపి అన్నాన్ని ఇంట్లో స్వయంగా తయారుచేసి కాకులకు తినిపించాలి. కార్యాలయంలో ఎదురయ్యే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దీనివల్ల శని, రాహువు, కేతువు దోషాలు కూడా తొలగిపోతాయి.
* ఆటంకాలు తొలగిపోయేందుకు గ్రహణం సమయంలో గేటుకు తాళం వేయాలి. తర్వాతరోజు ఆ తాళం తీసుకొని ఏదైనా ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. దీనివల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications