Maha shivratri 2024: మహా శివరాత్రి ఉపవాస నియమాలు!!
శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినాన హిందువులందరూ శివుడికి అభిషేకాలతో పూజాదికాలు నిర్వహిస్తారు. ఉపవాస, జాగరణలతో, శివనామ స్మరణలతో గడుపుతారు. అసలు మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఎందుకు చేస్తారు? ఉపవాసం ఏ విధంగా చేయాలి? మహాశివరాత్రి ఉపవాసానికి ఉన్న నియమాలు ఏమిటి? శివరాత్రి నాడు ఉపవాస వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఫలితం ఉంటుంది? అన్న విషయాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే ఉపవాసాన్ని ఆచరించడంలో మూడు రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి. అందులో అత్యంత కఠినమైన నిర్జల వ్రతం కూడా ఉంది. ఈ నిర్జల ఉపవాస వ్రతంలో శివరాత్రి ప్రారంభం నుండి అంటే మార్చి 8వ తేదీ ఉదయం 12గంటల సమయం నుండి మార్చి 9వతేదీ సూర్యోదయ సమయం వరకు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చేసే వ్రతమే నిర్జల వ్రతం.

ఇది చాలా కఠినతరమైన వ్రతం. ఇక రెండవది పలహార వ్రతం.. ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్ల రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్ తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే వీరు తీసుకునే ఏ పదార్థాలలోనూ ఉప్పు ఉండకూడదు. పండ్లు, పండ్ల రసాలతో పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తారు.
మూడవది సమాప్త వ్రతం. ఈ రకమైన ఉపవాసంలో ఫలహార వ్రతంలో పేర్కొన్న అన్నింటిని ఒక్కసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు. ఇక ఒకసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి. ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించలేరో వారు సమాప్త వ్రతాన్ని ఆచరిస్తారు.
ఉపవాస దీక్షను ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి, స్నానమాచరించి పూజలు చేయాలి. మహాశివరాత్రి రోజున ఉప్పు తీసుకోకూడదు. సాత్విక జీవనశైలిని అలవర్చుకోవాలి. మాంసం తినడం, ఉల్లిపాయలు, వెల్లి పాయలు ఇలాంటివి ఆహారంలో తీసుకోకూడదు. శారీరక ఆరోగ్యం కోసం కూడా ఉపవాస దీక్షను ఆచరించడం మంచిది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన చాలామంది భక్తులు తప్పనిసరిగా ఉపవాస దీక్షను ఆచరిస్తారు.












Click it and Unblock the Notifications