మహాలయ పక్షంలో ఏ తిధిలో శ్రాద్ధ కర్మ చేస్తే ఏలాంటి ఫలితం
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం.. ఈ మహాలయపక్షంలో పేదవారికి చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మచేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా మనకు లభించిన సమాచారం ఇది.

1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
2. విధియలో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.
3. తదియలో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.
4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగ వారు ( శత్రువులు ) లేకుండా చేయును.
5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.
6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.
7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.
8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.
9. నవమి అన్యోన్య దాంపత్యం
10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.
11. ఏకాదశి రోజున సకల వేదవిద్యా పారంగతులను చేయును.
12. ద్వాదశి రోజున స్వర్ణములను, స్వర్ణ ఆభరణములను సమకూర్చును.
13. త్రయోదశి రోజున సత్సంతానాన్ని, మేధస్సును, పశు, పుష్టి, సమృద్ధి, ధీర్గాయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.
14. చతుర్దశి తిది రోజున వస్త్రం లేక అగ్ని( ప్రస్తుత కాలంలో రైలు, మోటారు వాహనములు వల్ల విపత్తు ) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.
15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును.
16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరిపూర్ణతను చేకూర్చును.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలద్వార తెలుస్తోంది. మహాలయ పక్షాల్లో పేదలకు అన్నదానం చేయట శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే 'మహాలయ పక్షాలు' అంటారు. వీటినే 'పితృపక్షము' లనీ, 'అపరపక్షము' లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము. పితృదేవతలకు.. ఆకలా, ఇదేంటి? అనే సందేహం మీకు కలుగవచ్చు.. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం 'ఆకలి' అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః
అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షము వలన అన్నము లభిస్తుంది, యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది, ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే.. వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి.
ఎందుకు ఇంత తతంగం అని సందేహం కలుగవచ్చు .. మరణించిన ప్రాణి 'ఆత్మ' రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద 'జీవాత్మ'గా అవతరించడానికి.. అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.
మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి.. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి, అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి, అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే 'మోక్షం' అంటే. రేపు మనకైనా ఇంతే.. తద్దినాలు పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు పెట్టాలా? అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు, మరణించిన తల్లి/ తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు.
మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..'కాదు' అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ( వరదలు, భూకంపాలు, కరోనా ) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ 'మహాలయ పక్షాలు' నిర్దేశించబడ్డాయి.
పితృతిథి నాడు మూడు తరాలవారికి ( తండ్రి, తాత, ముత్తాత ) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ 'మహాలయ పక్షాలు' పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు ( గురువు కూడా తండ్రితో సమానం ) స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండప్రదానం ఇచ్చే అర్హత అధికారం మనకు ఉంది. దీనినే సర్వ కారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా, మా ఆకలా తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు.
పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ, పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలి.
* మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం.
దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ.. వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి 'ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి' నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి. మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి పవిత్రమును ( దర్భలతో చేసిన ఉంగరము ) ధరించి శ్రధ్ధగా, భక్తిగా మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి.
ఐదుగురు భోక్తలు ఎందుకంటే..
1. పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.
2. ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.
3. ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
4. ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
5. ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త.
ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే 'శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం' అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి. ఈ మహాలయ పక్షంలో పేదలకు అన్నదానం చేయడం చాలా శుభకరం, విశేషమైనది.
మహాలయ పక్షములు 15 రోజులు నది తీరం నందు మీ తరపున మా వేద బ్రాహ్మణోత్తములచే పితృ పూజ, మహనారాయణ హోమం, రుద్ర హోమం మహాలయ తర్పణం, శ్రాద్ధకర్మ మీ పితృ దేవతలకి ఇప్పించడానికి మా ఆధ్వర్యంలో బ్రహ్మణోత్తములచే ఇప్పించబడును. పక్షం రోజులు తర్పణం మరియు శ్రాద్ధకర్మలు జరుగును తిధి నాడు చేయించు కోవచ్చు లేదా మహా మహాలయ అమావాస్య నాడు ఒకరోజు చేసుకోవచ్చును.
ఏదైనా వ్యాధి రూపంలో లేదా ఆకస్మిక మరణం కరోనా లేదా విష జ్వరాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు మరే ఇతర మైనటువంటి అనారోగ్యమైనటువంటి కారణాలు వలన చనిపోయిన వారికి సెప్టెంబర్ 24 వ తారీఖు నాడు విషశస్త్ర హతనం మహాలయం నాడు తర్పణం శ్రాద్ధం జరుగును వీరికి మోక్ష ప్రాప్తి కొరకు మహా నారాయణ హోమం మరియు రుద్ర హోమం నిర్వహించబడును, ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించండి .. డా. ఎం. ఎన్. ఆచార్య 9440611151.












Click it and Unblock the Notifications