ఫిబ్రవరి 23నుండి కుంభరాశిలో కుజుడితో ఈ రాశులవారు నక్కతోక తొక్కబోతున్నారు

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశులు ప్రభావితం అవుతాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కుంభ రాశిలో కుజ సంచారం జరగబోతుంది. కుంభరాశిలో కుజ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో వారి వ్యక్తిగత కార్యకలాపాలు సజావుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి రాశ్యధిపతి కుజుడు లాభ స్థానంలోకి వెళ్లడం వల్ల మేష రాశి వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. సంపాదన, పదోన్నతులపై దృష్టి సారించి ఈ సమయంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఏప్రిల్ 2 నాటికి సాహసోపేత ప్రయత్నాలు చేపట్టి, సక్సెస్ ను చూస్తారు.

Mars transit in Aquarius from February 23rd to April 2nd gives luck and happiness to these zodiacs

వృషభ రాశి

వృషభ రాశి వారికి దశమ స్థానంలో కుజుడి ప్రవేశం ఉద్యోగంలో వీరికి మంచి అవకాశాలను పెంచుతుందని చెబుతున్నారు. కార్యకలాపాలు, లావాదేవీల వృద్ధి కనిపిస్తుంది. అధికారులు వీరి పనిని ప్రశంసిస్తారు. పదోన్నతులపై దృష్టి సారించి, కొందరు ఉద్యోగాలు మారవచ్చు. నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభించవచ్చు. వృషభ రాశి వారికి కీర్తిప్రతిష్టలు పెంచే సామాజిక కార్యక్రమాల్లో వీరు చురుకుగా పాల్గొంటారు.

సింహరాశి

సింహ రాశి వారికి కుజ సంచారం లాభాలను చేకూరుస్తుంది. సప్తమ స్థానంలో కుజుడు ప్రవేశించడం కారణంగా ఈ సమయంలో సింహ రాశి వారి వ్యవహార శైలిలో మార్పులు వస్తాయి. వీరు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటి సాధనకై దూసుకుపోతారు. నాయకత్వ ప్రతిభకు తగిన వృత్తుల్లోకి మారే అవకాశం ఉంది. సింహ రాశి వారు ఉన్నత పదవులు, సామాజిక గుర్తింపు, ఆదాయ వృద్ధికి వీరు నూతన ప్రయత్నాలు చేపడతారు.

తులారాశి

తుల రాశి వారికి పంచమ స్థానంలో కుజ సంచారం తులా రాశి వారి సృజనాత్మక శక్తిని పెంచుతుంది. కొత్త ఆలోచనలతో వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల్లో వినూత్న ఒరవడిని సృష్టిస్తారు. ఈ సమయంలో పట్టుదల, ఆత్మవిశ్వాసం, సాహసోపేత పనుల పట్ల తాపత్రయం పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన అవకాశాలు వస్తాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో కుజుడి ప్రవేశం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృశ్చిక రాశి వారికి తీవ్ర పోటీ ఉంటుంది. వ్యక్తిగత లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటి సాధనకై నిరంతరం పాటుపడతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త ఆస్తులు,వాహన సౌకర్యాలను తప్పకుండా సాధించుకుంటారు.

మకర రాశి

మకర రాశి వారికి ధన స్థానంలో కుజుడి ప్రవేశం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుండి విముక్తిపై శ్రద్ధను పెంచుతుంది. పట్టుదల గల ఈ రాశికి కుజుడి బలం తోడవడంతో తక్కువ కాలంలోనే మకర రాశి వారు లక్ష్యాలను సాధిస్తారు. ఆదాయ వృద్ధి ప్రణాళికల్లో మార్పులు చేసి, ఖర్చులు తగ్గిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా వ్యాపారాల్లో మకర రాశి జాతకులు ధైర్యంగా పెట్టుబడులు పెడతారు.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+