రేపటి నుంచి ఈ రాశులవారు జమిందారులే.. మీ రాశి ఉందా?
మే రెండోవారంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు, నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి అన్నీ శుభాలే కలిగితే మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. జ్యోతిష్యం ప్రకారం ఏయే రాశులవారికి ఎలా ఉంటుంది? వారికి ఏ విధంగా కలిసి వస్తుంది? వారికి ఎదురయ్యే ప్రతికూల పరిణామాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.
వృషభరాశి
ఈ రాశివారికి బాగుంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ఆస్తి సంబంధిత విషయాల్లో శుభవార్తలు వింటారు. ప్రధానంగా ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

మిథునరాశి
చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. స్నేహితుల నుంచి మద్దతు లభించడంవల్ల పనులన్నింటినీ పూర్తిచేయగలుగుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగులకు వారు పనిచేసే కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
సింహరాశి
వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు మంచి ప్రయోజనాలను పొందుతారు. సంతోషంగా జీవిస్తారు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఉన్నాయి. వాటితోపాటు వేతనం కూడా పెరుగుతుంది. ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం అనుకూలగా ఉంటుంది.
మీనరాశి
వీరికి అదృష్టం తోడుంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు రావడంద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. కృషికి తగ్గ ఫలితం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.












Click it and Unblock the Notifications