నవ పంచమ రాజయోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే!

వేద జ్యోతిష్య శాష్ట్రంలో గ్రహాల సంచారం వివిధ రాశుల వారి జాతకాలను నిర్దేశించటం మాత్రమే కాదు అనేక యోగాలకు కారణం అవుతాయి అన్న విషయం తెలిసిందే. గ్రహాల సంచారం కారణంగా అనేక శుభ, అశుభ యోగాలు చోటు చేసుకుంటాయి. ఇక అక్టోబర్ నెలలో అత్యంత ముఖ్యమైన రాజయోగం ఏర్పడుతుంది.

నవ పంచమ రాజయోగం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ పంచమ రాజయోగం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అక్టోబర్ 20 నుండి కుజుడు తన అత్యల్ప రాశి అయిన కర్కాటక రాశిలో సంచారం మొదలుపెట్టాడు. కర్కాటకరాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల రాహువుతో కలిసి నవపంచమ రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం కారణంగా మూడు రాశులవారికి లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో వారి పంట పండినట్టే అని చెప్తున్నారు.

navpancham rajayoga gives wealth for three zodiac signs

కన్యా రాశి
కన్యా రాశి వారికి నవ పంచమ రాజయోగం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో కన్యా రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల నుండి లాభాలు ఆర్జించటానికి ఇదే సరైన సమయం. ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్ లను ఆశించవచ్చు. ఈ సమయంలో కన్యా రాశి వారి గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. వివిధ వ్యాపార ఒప్పందాలు చాలా లాభదాయకంగా ఉంటాయి.

సింహరాశి
సింహ రాశి వారికి నవ పంచమ రాజయోగం కలిసొస్తుంది. ఈ సమయంలో సంపాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాజయోగంతో సింహరాశి జాతకులు కెరీర్ లో అన్ని విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పని చేసే చోట తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కే చాన్స్ ఉంది. సింహరాశి వారి ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉంటుంది.

మకర రాశి
మకర రాశి వారికి నవ పంచమ రాజయోగం లబ్ధిని చేకూరుస్తుంది. ఇది చాలా శుభ ఫలితాలను తెస్తుంది. ఆర్ధికంగా బాగా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలు పొందేందుకు ఇది సరైన సమయం. ఈ సమయంలో మకర రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి లేదా భూముల మీద పెట్టుబడులు మీకు చాలా ప్రయోజనాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత ధృడపడుతుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+