ఈశాన్యంలో గేటు.. లక్ష్మీదేవికి డైరెక్ట్ వెల్కమ్... కానీ ఈ నియమాలు మర్చిపోవద్దు!

సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్ గోడల నిర్మితం మాత్రమే కాకుండా, అందులో నివసించే వారి జీవితాల్లో సంతోషం, ఐశ్వర్యాన్ని నింపేలా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం భారతీయ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం లేదా సింహద్వారం దిశ మన జీవితాన్ని నిర్ణయిస్తుంది.

ఈశాన్యదిశలో ప్రధాన గేటు ఉంటే వారి దీవెన దక్కినట్టే

వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో ప్రధానగేటు నిర్మించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈశాన్య దిశకు సాక్షాత్తు పరమశివుడు అధిపతిగా ఉంటారు. అందుకే ఈ దిశను శివస్థానం అని కూడా వ్యవహరిస్తారు. అదేవిధంగా దేవగురువైన బృహస్పతి గ్రహం ఈ దిశను పాలిస్తుంది. నీటి మూలకం లేదా జల దేవత స్థానమైన ఈశాన్యంలో ప్రధాన గేటును ఏర్పాటు చేసుకోవడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి.

North-East gate Brings Prosperity and also goddess lakshmidevi blessing but take these precautions

ఈశాన్యంలో గేటు ఉంటే ఈ అనుకూలతలు

ఆర్ధికంగా వృద్ధి సాధించాలనుకునే వారికి ఈశాన్య దిశలో ఉండే గేటు ఎంతో మేలు చేస్తుంది. ఈ దిశ నుండి సానుకూల శక్తులు నిరంతరం ప్రవహించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభించడం, ఉద్యోగస్తులకు కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సులువవుతుంది. అనవసరపు వృధా ఖర్చులు తగ్గి ఆర్థిక స్థిరత్వం ఏర్పడటానికి ఈ గేటు అనుకూలిస్తుంది.

గేటు ఈ దిశలో ఉంటే శారీరక, మానసిక వికాసం, సంతోషం

కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొనడానికి కూడా ఈ దిశ ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూసే దంపతులకు తూర్పు లేదా ఈశాన్య దిశలలో గేటు ఉండటం సానుకూల ఫలితాలను ఇస్తుంది. శారీరక, మానసిక వికాసం మెరుగై పిల్లలు చదువులో రాణిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి, వివాహాది శుభకార్యాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో పూర్తవుతాయి.

నిర్మాణంలో అస్సలు చేయకూడని పొరపాట్లు

ఈశాన్యంలో ప్రధాన ద్వారం అమర్చే క్రమంలో చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈశాన్య మూలకు సరిగ్గా ఆనుకొని గేటును ఎప్పుడూ నిర్మించకూడదు. తూర్పు సరిహద్దు గోడకు ఈశాన్యం వైపుగా లేదా ఉత్తర సరిహద్దు గోడకు ఈశాన్యం వైపు కొద్దిగా స్థలం వదిలి మాత్రమే గేటు అమర్చాలి. గోడ మూలకు పూర్తిగా ఆనించి గేటు పెట్టడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

జూలై 2న రేవతి నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి హెచ్చరిక!
జూలై 2న రేవతి నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి హెచ్చరిక!

ఈశాన్య దిశలో గేటు ఉంటే ఈ జాగ్రత్తలు అవసరం

ఈశాన్య గేటు చుట్టుపక్కల ఎలాంటి మురికి కాలువలు, డస్ట్ బిన్లు లేదా పాత సామాన్లు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఈ ప్రదేశం ఎప్పుడూ ప్రశాంతంగా, వెలుతురుతో నిండి ఉండేలా చూసుకోవాలి. ప్రధాన గేటుకు నేరుగా అడ్డంకులు ఉండటం కూడా మంచిది కాదు. ఇంటి గేటుకు ఎదురుగా పెద్ద వృక్షాలు, కరెంట్ స్తంభాలు లేదా ఇతరుల ఇళ్ల మూలలు రాకుండా చూసుకోవాలి. వీటిని వాస్తు శాస్త్రంలో ద్వార దోషాలుగా పిలుస్తారు. ఒకవేళ ఇటువంటి అడ్డంకులు ఉంటే, వాటి నివారణకు గేటు పైన లేదా పక్కన స్వస్తిక్ లేదా ఓం గుర్తులను ఉంచడం వల్ల కొంతవరకు దోష నివారణ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+