• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలేంటీ ? ఏ ధాన్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి ?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు... ఇవన్నీ చిరు మరియు తృణధాన్యాలే. పోషకాలను బట్టి ముతకధాన్యాల్లోని రకాలైన జొన్నల్ని కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. దాంతో గత కొన్నేళ్లుగా మన ఆహారంలో ప్రధానపాత్ర పోషిస్తున్న బియ్యం మీద అనేక పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు.

బాగా పాలిష్‌ చేసిన బియ్యం తినడంవల్ల బరువు పెరగడం, మధుమేహం బారిన పడటం పెరిగింది. ఆధునిక జీవనశైలి కూడా మరో కారణం. ఈ పరిస్థితుల్లో మిల్లెట్స్‌ని రోజూవారీ ఆహారంలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందనీ, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివనీ వాళ్లు నొక్కి చెబుతున్నారు.

పీచు ఎక్కువగా ఉండటంతో వీటి పిండితో రుచికరమైన వంటలు చేయలేం. చూడ్డానికీ అంత బాగుండవు. అందుకే చిరుధాన్యాల వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు పొట్టు తీసి, పీచును తగ్గించి మృదువైన పిండిని తయారుచేసే యంత్రాలు చాలానే వచ్చాయి. వీటిద్వారా పిండి, రవ్వ పట్టిస్తే అన్ని రకాలూ చేసుకోవచ్చు.

nutritive value of the molasses

నలభై దాటకుండానే అధిక రక్తపోటూ, మధుమేహం లాంటి సమస్యలు ఈ రోజుల్లో చాలామంది మహిళల్ని వేధిస్తున్నాయి. వాటి ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే చిరుధాన్యాల్ని మించిన పరిష్కారం లేదంటున్నాయి అధ్యయనాలు. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు విశ్రాంతి పొందేలా చేసి, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆ పోషకాన్ని సమృద్ధిగా అందుకోవాలంటే బార్లీ, సజ్జలూ, రాజ్‌గీరా, సామల్లాంటివి తీసుకోవాలి

చిరుధాన్యాల్లో పీచుశాతం, నిదానంగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు ఎక్కువగా, కొవ్వుశాతం తక్కువగా ఉంటాయి. అందుకే కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. తరవాత కొన్ని గంటలపాటు ఆకలి వేయదు. ముఖ్యంగా జొన్నల్నే తీసుకుంటే వీటి నుంచి మాంసకృత్తులు సమృద్ధిగా అందుతాయి.

ఇనుమూ, క్యాల్షియం, జింక్‌, పొటాషియం, పాస్ఫరస్‌ లాంటి పోషకాలూ లభిస్తాయి. అదనంగా థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ లాంటి బి విటమిన్లూ... టానిన్లూ, ఫెనోలిక్‌ ఆమ్లాలూ, యాంథోసియానిన్స్‌ లాంటి ఫైటోకెమికల్స్‌ అందుతాయి. ఇవన్నీ బరువు తగ్గించడానికి ఉపయోగపడేవే. శరీరానికి శక్తినిచ్చేవే. గర్భిణులు తాము తీసుకునే ఆహారంలో జొన్నల్ని చేరిస్తే వాళ్లకు అవసరమైన విటమిన్లూ, ఖనిజాలూ అందుతాయని అధ్యయనాల్లో తేలింది.

చిరుధాన్యాల్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవనవిధానంలో చేర్చుకోవాలి. రోజువారీ తీసుకునే ఆహారంలో యాభై, అరవైశాతం వరకూ చిరుధాన్యాలతో చేసిన పదార్థాలుండేలా చూసుకోవాలి. కొందరికి వాటి రుచి నచ్చదు. కొన్నిసార్లు అరగదు. అలాంటప్పుడు చేసుకునే విధానాన్ని ఓసారి గమనించుకోవాలి.

సాధారణ పద్ధతిలోనే వాటిని చేసుకోవాలి. అంటే జొన్నరొట్టె, రాగి జావ, సజ్జల కిచిడీ రూపంలో తీసుకోవాలి. మెనోపాజ్‌ దాటి అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు లేదా గుండెజబ్బులొచ్చే ఆస్కారం ఉన్న మహిళలు వారంలో కనీసం ఆరుసార్లు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ అదుపులో ఉంటాయి.

English summary
The nutritive value of the molasses is also included in the list of nutrients. We have done many research on rice, which has been the mainstay of our diet for the last few years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more