ఏపీలో దారుణం.. ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి.. లోకో పైలట్‌కి తీవ్రగాయాలు !!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గురువారం రాత్రి తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ (GT) ఎక్స్‌ప్రెస్‌పై గుర్తుతెలియని దుండగులు రాళ్లు, భారీ వస్తువులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రైలు ఇంజిన్ క్యాబిన్ అద్దాలు పూర్తిగా ధ్వంసమవగా.. విధుల్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదకర పరిస్థితుల్లోనూ లోకో పైలట్లు అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సింగరాయకొండ - ఉలవపాడు మధ్య దాడి..

రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సింగరాయకొండ - ఉలవపాడు రైల్వే స్టేషన్ల మధ్య జీటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు రైలును లక్ష్యంగా చేసుకుని రాళ్లు, ఇతర బరువైన వస్తువులను విసిరారు. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు ఇంజిన్‌ను ఢీకొన్న రాళ్లు క్యాబిన్ ముందు భాగంలోని విండ్‌షీల్డ్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి.

stone-pelting-on-grand-trunk-express-at-andhra-pradesh-while-travelling-from-delhi-to-chennai-and-on

లోకో పైలట్‌కు తీవ్ర గాయాలు

ఈ దాడిలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎం. జయరామ్ తీవ్రంగా గాయపడ్డారు. పగిలిన అద్దాల ముక్కలు, రాళ్లు ఆయన తలకు బలంగా తగలడంతో రక్తస్రావమైంది. అయినప్పటికీ ఆయన విధి నిర్వహణలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తీవ్ర నొప్పి, గాయాల మధ్యే సహచర లోకో పైలట్‌తో కలిసి రైలును సురక్షితంగా ముందుకు నడిపించారు.

అయితే ఇంజిన్ క్యాబిన్ పూర్తిగా దెబ్బతిన్నా, పరిస్థితిని అదుపులో ఉంచిన లోకో పైలట్లు రైలును సమీపంలోని ఉలవపాడు రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లి సురక్షితంగా నిలిపారు. వారి అప్రమత్తత కారణంగా రైలులో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. రైల్వే వర్గాలు లోకో పైలట్ల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాయి.

వెంటనే చికిత్స.. విజయవాడకు తరలింపు

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది ఉలవపాడు స్టేషన్‌కు చేరుకున్నారు. గాయపడిన జయరామ్‌ను సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.

వైరల్‌గా మారిన లోకో పైలట్ వీడియో

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. వీడియోలో తలకు గాయాలతో, రక్తస్రావం అవుతున్నప్పటికీ లోకో పైలట్ జయరామ్ ఇంజిన్ క్యాబిన్‌లో కూర్చుని కనిపించారు. చుట్టూ పగిలిపోయిన అద్దాల ముక్కలు, ధ్వంసమైన క్యాబిన్ పరిస్థితి ఘటన తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. నెటిజన్లు ఆయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

నిందితుల కోసం గాలింపు..

ఈ ఘటనపై వెంటనే స్పందించిన Railway Protection Force (ఆర్‌పీఎఫ్) మరియు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రైల్వే ఆస్తులపై దాడి చేయడం తీవ్రమైన నేరమని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో రైల్వే భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడుల ఘటనలు నమోదవుతుండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+