పుట్టిన ప్రతి బిడ్డకు గోల్డ్ రింగ్.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాయిమామన్ గోల్డ్ రింగ్ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ పథకం కోసం బడ్జెట్ లో రూ. 755.83 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జూన్ 22,2026 నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన బిడ్డలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. తాయిమామన్ గోల్డ్ రింగ్ స్కీమ్ ను సెప్టెంబర్ 15 న పెరియార్ అన్నా జన్మదినం సందర్భంగా ప్రారంభిస్తామని సీఎం విజయ్ పేర్కొన్నారు.
ఇదే విషయంపై రాష్ట్ర ఆరోగ్య, హ్యూమన్ సర్వీసెస్ శాఖ కీలక ప్రకటన చేసింది. తమిళనాడులో శాశ్వత నివాసం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో పలు కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో ముఖ్యమైనది తాయిమామన్ గోల్డ్ రింగ్ పథకం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ప్రతి శిశువుకు గౌరవంగా ఒక గ్రామ్ గోల్డ్ రింగ్ ను అందించే ఉద్దేశంతో ఈ పథకం అందుబాటులోకి రానుంది.
తల్లీ బిడ్డల ఆరోగ్యం, సంక్షేమానికి తమిళనాడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇక ఇతర పథకాలైన.. గర్భిణీలకు ఆర్థిక సాయం, ఫ్రీ డెలివరీ అండ్ అప్పుడే పుట్టిన పిల్లలకు సేవలు, ఎమర్జెన్సీ కేర్, న్యూట్రిషన్ సపోర్ట్, తదితర కార్యక్రమాలను విజయవంతంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. తమిళ సంప్రదాయం ప్రకారం.. పుట్టిన బిడ్డలకు మేనమామ తరఫున గోల్డ్ రింగ్ ను అందించడం ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు సీఎం విజయ్ స్వయంగా మేనమామగా మారి ఈ పథకాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

తాయిమామన్ గోల్డ్ రింగ్ పథకం కింద సంవత్సరానికి రూ. 755.83 కోట్లను తమిళనాడు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు పథకం అమలుకు తక్షణమే టెండర్లను ఆహ్వానించాలని తమిళనాడు సీఎం విజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పథకం జూన్ 22, 2026 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ప్రతి బిడ్డకు వర్తించనుంది. పెరియార్ అన్నా జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని సెప్టెంబర్ 15న సీఎం విజయ్ ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications