సమంత సినిమా హిట్ తో అక్కినేని అఖిల్ ఫుల్ జోష్.. ఎందుకో తెలుసా..?
ఈ ఏడాది జనవరి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ అప్స్ అండ్ డౌన్స్ ను చవిచూసింది. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మనశంకరవర ప్రసాద్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆశించినంత విజయం కాలేదు. దాంతో గత కొంత కాలంగా పూర్తిగా నిస్సత్తువలో ఉన్న టాలీవుడ్ కు మరోసారి పూర్వ వైభవం దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సింగ్ గీతం, అలాగే స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన మా ఇంటి బంగారం ఇలా వరుసగా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
లేటెస్ట్ గా విడుదలైన సమంత మా ఇంటి బంగారం మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీకి బీవీ నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సమంత ఈ చిత్రంతో తిరిగి వెండితెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సమంత నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మా ఇంటి బంగారం మూవీని ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. అయితే గతంలో సమంత- నందిని రెడ్డి కాంబోలో 'ఓబేబీ', 'జబర్దస్త్' మూవీస్ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా సమంత సినిమా హిట్టు కావడంతో అక్కినేని అఖిల్ తో పాటు లెనిన్ చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే ఇదే మూమెంటమ్ కంటిన్యూ అయి నెక్ట్స్ రాబోతున్న తమ సినిమా కూడా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఇప్పటికే అక్కినేని అఖిల్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే.

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'లెనిన్' ఈ సినిమా పలు వాయిదాల తర్వాత జూలై 10 న విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రొమోషన్స్ లో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. ఒక రకమైన టెన్షన్ అనుభవిస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications