కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్.. వీడియో వైరల్!
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారిని ఆప్యాయంగా పలకరించి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో కళ్లలో నీళ్లు తిరుగుతున్నా కేసీఆర్ ఆ దుఃఖాన్ని దిగమింగుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భరోసా కల్పించారు.
కేసీఆర్ నల్లబెల్లి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా తరవచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు భారీగా తరలిరావడంతో స్వల్ప తోపులాట జరగగా.. పోలీసులు కేసీఆర్ కాన్వాయ్ ను సుదర్శన్ రెడ్డి నివాసంలోకి తీసుకెళ్లారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కును కేసీఆర్ అందజేశారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షల చెక్ రాసి వారికి అందజేశారు. అనంతరం నల్లవెల్లి నుంచి ఎర్రవెల్లకి తిరుగు ప్రయాణం అయ్యారు.
కంటతడి పెట్టుకున్న కేసీఆర్
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2026
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో భావోద్వేగానికి గురైన కేసీఆర్ https://t.co/aEX01wEaBe pic.twitter.com/S0kc8OfACD












Click it and Unblock the Notifications
