IND vs BAN: ఆ టూర్ పై బీసీసీఐ హ్యాండ్సప్- ఇక కేంద్రం చేతుల్లోనే..!

బంగ్లాదేశ్ లో గతంలో తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందువులపై దాడులు జరిగాయన్న కారణంతో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను కేంద్రం ఒత్తిడితో బీసీసీఐ తప్పించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను భారత్ లో ఆడేందుకు నిరాకరిస్తూ బంగ్లాదేశ్ ఏకంగా టోర్నీ నుంచే తప్పుకుంది. అప్పటి నుంచీ ఉప్పూనిప్పుగా మారిన భారత్-బంగ్లా క్రికెట్ సంబంధాలు.. ఇప్పుడు తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ప్రభుత్వంలో తిరిగి సాధారణ స్థితికి వస్తాయని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ (Bangladesh) తమ దేశానికి భారత్ (India)ను ఆహ్వానించింది.

Sheikh Hasina: అరెస్టవుతా లేదా చచ్చిపోతా..! బంగ్లా రిటర్న్ ఎప్పుడో తేల్చేసిన షేక్ హసీనా..!
Sheikh Hasina: అరెస్టవుతా లేదా చచ్చిపోతా..! బంగ్లా రిటర్న్ ఎప్పుడో తేల్చేసిన షేక్ హసీనా..!

ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 15 వరకు వన్డేలు ఆడేందుకు టీమిండియాను బంగ్లాదేశ్ ఆహ్వానిస్తోంది. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు భారత జట్టును బంగ్లాదేశ్ పంపించాలా వద్దా అనే అంశంపై మాత్రం బీసీసీఐ (BCCI)నిర్ణయం తీసుకోలేకపోతోంది. భారత్ ను పంపితే ఓ తలనొప్పి, పంపకపోతే మరో తలనొప్పి. అందుకే బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసింది. బంగ్లాదేశ్ టూర్ కు టీమిండియాను పంపే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

BCCI Seeks Centre s Clearance for Bangladesh Tour Says It Can t Take Decision on Its Own Report
భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!
భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!

ఈ టూర్ పై బీసీసీఐ ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసిన తర్వాత ఈ సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు టీమిండియా ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్ ముగిసిన వారం తర్వాత, అంటే సెప్టెంబర్ 24న జపాన్‌లో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలలో కూడా జట్టు పాల్గొనాల్సి ఉంది. ఈ మధ్యలో భారత్-బంగ్లా సిరీస్ నిర్వహించాల్సి ఉంది. షేక్ హసీనా కారణంగా భారత్-బంగ్లా మధ్య పరిస్ధితులు మళ్లీ వేడెక్కుతున్న వేళ కేంద్రం ఈ సిరీస్ విషయంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+