గొప్పోడివయ్యా రామ్ చరణ్.. అనాథ పిల్లలకు స్పెషల్ గిఫ్ట్ !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం "పెద్ది". 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్ సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో.. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మించారు.
ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించి అద్బుత విజయాన్ని అందుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి ఘోర పరాభవం తర్వాత రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ హిట్ కొట్టడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులను నెలకొల్పింది ఈ చిత్రం.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా "పెద్ది" మూవీ టీం అనాథ ఆశ్రమాలలోని పిల్లలకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్‌ను ఉపయోగించిన విషయం తెలిసిందే. కాగా అలాంటి బ్యాట్‌ను పోలిన ప్రత్యేకమైన రెప్లికాలను యూనిట్ తయారు చేయించింది. అంతే కాకుండా ఆ బ్యాట్లపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా సంతకాలు కూడా చేయడం గమనార్హం. ఆ బ్యాట్లను అనాథ ఆశ్రమాలలోని చిన్నారులకు మూవీ యూనిట్ పంపిణీ చేసింది.
ఇక మెగాపవర్ స్టార్ సంతకం చేసిన బ్యాట్లను అందుకోవడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రికెట్ బ్యాట్ లను 'పెద్ది' సినిమా కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం సినిమా కోసమే కాకుండా.. అనాథ పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనే యూనిట్ రిక్వెస్ట్ మేరకు, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరిన్ని బ్యాట్లను సిద్ధం చేశారని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు రీసెంట్ గానే ఈ సినిమాకు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలను యాడ్ చేశారు. అలానే ఈ మూవీ భారీ విజయం సాధించినందుకు గాను అభిమానుల సమక్షంలో జూన్ 23వ తేదీన (మంగళవారం) సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని ప్రముఖ 'శిల్పకళా వేదిక' లో ఒక భారీ 'మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారు.












Click it and Unblock the Notifications