రాఖీపండుగకు ముందు బుధాదిత్య రాజయోగంతో వీరికి సంపదల వెల్లువ!

2026 ఆగస్టు 27న సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు సంయోగం చెంది బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. రక్షాబంధన్‌కు ఒక రోజు ముందు ఏర్పడే ఈ శుభ యోగం ఐదు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తుంది.గ్రహాల రాజు సూర్యుడు ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవాన్ని సూచిస్తాడు. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు బుద్ధి, కమ్యూనికేషన్, వ్యాపారాన్ని సూచిస్తాడు. ఇద్దరూ కలిసి జీవితంలోని అన్ని రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతారు.

బుధాదిత్య రాజయోగంతో అదృష్ట రాశులు ఇవే

బుధాదిత్య రాజయోగ ప్రభావంతో మేష, మిథున, సింహ, తులా, ధనుస్సు రాశుల వారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. ఈ యోగం కాలంలో ఈ ఐదు రాశుల వారు కెరీర్, వ్యాపారం, ఆదాయంలో సానుకూల మార్పులు అనుభవిస్తారు. ఇది వీరికి విశేష లాభాలను ఇచ్చే కాలంగా చెప్పొచ్చు.

Budhaditya rajYoga forms on 27 August 2026 just before Raksha Bandhan luck to these zodiac signs

మేష రాశి: మేషరాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు, నాయకత్వ గుణాలు ప్రశంసలు పొందుతాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారి ఆదాయం పెరుగుతుంది.జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది.

మిథున రాశి: మిధునరాశి వారికి బుధాదిత్య రాజయోగంతో అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారి మాటల శక్తి పెరుగుతుంది. మార్కెటింగ్, సేల్స్‌లో కొత్త కస్టమర్లు వస్తారు. అసంపూర్ణ పనులు పూర్తవుతాయి. స్నేహితుల సహాయంతో లాభాలు వస్తాయి.

సింహ రాశి: బుధాదిత్య రాజయోగం కారణంగా సింహరాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా పెద్ద బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది.

గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి మూడురోజుల్లో జాక్ పాట్ మొదలు!
గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి మూడురోజుల్లో జాక్ పాట్ మొదలు!

తుల రాశి: తులా రాశి వారికి బుధాదిత్య రాజయోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి. కెరీర్‌లో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ప్రభావవంతుల మద్దతు లభిస్తుంది. భాగస్వామ్య నిర్ణయాలు లాభదాయకం. ప్రేమ జీవితంలో రొమాంటిక్ క్షణాలు అనుభవిస్తారు.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి జాతకులకు వృత్తి, వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి. వీరికి ఈ సమయంలో ఆదాయం పెరుగుదల కనిపిస్తాయి. ఇది ధనుస్సు రాశి జాతకులకు శుభ సమయం.ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+