e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!

భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు, విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలోకి ఈ-వీసా ఆధారంగా అడుగుపెట్టే విదేశీయుల కోసం కొత్తగా మరో 11 అంతర్జాతీయ ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి విమానాశ్రయంతో పాటు భోపాల్ ఎయిర్‌పోర్టు, మరో తొమ్మిది కీలకమైన ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఈ తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఈ-వీసా ద్వారా ప్రవేశించగలిగే మొత్తం కేంద్రాల సంఖ్య ఏకంగా 88కి చేరింది.

కొత్తగా చేరిన ప్రవేశ మార్గాలు ఇవే!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ కొత్త సదుపాయంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, తొమ్మిది ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ విమానాశ్రయాల నుంచి విదేశీయులు ఇకపై నేరుగా ఈ-వీసాతో ప్రవేశించవచ్చు.

India Expands e-Visa Access with 11 New Entry Ports Including Tirupati and Bhopal International Airports

వీటితో పాటు భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ, అలాగే అగర్తలా, దర్రంగా, గేడె, ఘోజాడంగా, హరిదాస్‌పూర్, జైగావ్, డావుకీ, మోరే ప్రాంతాల్లోని ల్యాండ్ చెక్‌పోస్టులను ఈ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఉన్న 88 కేంద్రాలలో 37 విమానాశ్రయాలు, 38 సముద్ర పోర్టులు, 13 భూ సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి.

72 గంటల్లోనే 95 శాతం ఈ-వీసాలు క్లియర్!

దేశంలో టూరిజం అభివృద్ధికి, విదేశీ ప్రయాణాలను సులభతరం చేసేందుకు కేంద్రం అనేక ఆధునిక సాంకేతిక మార్పులు చేస్తోంది. అత్యంత వేగవంతమైన భద్రతా తనిఖీలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా పర్యాటకులు సులభంగా అనుమతులు పొందుతున్నారు. ప్రస్తుతం భారత్ జారీ చేస్తున్న మొత్తం వీసాల్లో దాదాపు 78 శాతం వరకు ఎలక్ట్రానిక్ వీసాలే కావడం విశేషం. అంతేకాకుండా అందిన దరఖాస్తుల్లో సుమారు 95 శాతం ఈ-వీసాలను కేవలం 72 గంటల్లోనే అధికారులు క్లియర్ చేస్తున్నారు.

43 నుంచి 172 దేశాలకు విస్తరించిన సేవలు

భారత ప్రభుత్వం తొలిసారిగా 2014లో 'ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్' పేరుతో కేవలం 43 దేశాలకు మాత్రమే ఈ-వీసా వెసులుబాటును ప్రారంభించింది. కానీ ఏటికేడు ప్రజాదరణ పెరగడంతో ప్రస్తుతం ఈ సదుపాయం ఏకంగా 172 దేశాల పౌరులకు విస్తరించింది. పర్యాటకం, వ్యాపారం, వైద్యం, ఉన్నత విద్య, పర్వతారోహణ, క్రూయిజ్ ప్రయాణాలు వంటి దాదాపు 17 రకాల విభిన్న అవసరాల కోసం వచ్చే విదేశీయులకు ఈ-వీసాలను జారీ చేస్తున్నారు. తాజా విస్తరణతో దేశంలోకి విదేశీ పెట్టుబడులు, పర్యాటక రంగం మరింత వేగంగా పుంజుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+