హైదరాబాద్ నీళ్లు తాగుతున్నారా..? మీ బాడీ షెడ్డుకే..! షాకింగ్ రిపోర్డు వెలుగులోకి..!

హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతూ విశ్వ నగరంగా మారుతోంది. ప్రపంచంలోని మహా నగరాల్లో హైదరాబాద్ గతేడాది 41వ స్థానానికి చేరింది. ప్రస్తుతం భారత్ లోని మెట్రో పాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాగే భాగ్యనగరంలో ప్రస్తుతం జనాభా కోటీ 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అంతేకాదు హైదరాబాద్ లో ఏటా 3 శాతం జనాభా పెరుగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. జనాభా పెరుగుదలతో పాటు నగర వాసులకు నీటి కష్టాలు కూడా పెరుగుతున్నాయి. భాగ్యనగరంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నీళ్లు బంద్ అంటూ వస్తున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. భూగర్భ జలాలు అడుగంటిపోయి ఈ ఏడాది వేసవిలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అసలే అంతంత మాత్రం ఉన్న నీటిలో ఇప్పుడు ప్రమాదకర విష వాయువులు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దాంతో నగర వాసులు భయాందోళనలో ఉన్నారు.

అధిక జనాభా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీటి, పర్యావరణం, కాలుష్యం సమస్యలు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు హైదరాబాద్ లో అదే జరుగుతోంది. ఈ ఏడాది మరీ ఘోరంగా ఎల్ నినో ప్రభావంతో నీటి సంక్షోభంలో నగరం ఉంది. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దాంతో ప్రజలు నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు ఉన్న ఆ కాస్త నీటిలోనే ప్రమాదకరంగా నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయిలు పెరిగినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ భూగర్భ జలాల్లో ఈ విష వాయువులు పెరగడం కారణంగా ముఖ్యంగా పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్త సంబంధిత వ్యాధులు, బర్త్ డిఫెక్ట్స్, ఎముకల బలం తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Hyderabad groundwater Excessive levels nitrate fluoride detected in shocking report comes to light

ఈ మేరకు 2023 లో ప్రీ మాన్సూన్ నుంచి పోస్ట్ మాన్సూన్ వరకు దాదాపు 44 గ్రౌండ్ వాటర్ శాంపిల్స్ ను పరీక్షించారు. ఈ పరీక్షలో 36 శాంపిల్స్ లో లీటర్ కు 45 ఎంజీ కంటే అధిక స్థాయిలో నైట్రేట్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే మాన్సూన్ తర్వాత 40 వరకు శాంపిల్స్ ను సేకరించి పరీక్షలు జరిపారు. సౌత్ వెస్ట్రన్ అలాగే సెంట్రల్ ఏరియాల్లో అధిక సంఖ్యలో నైట్రేట్, ఫ్లోరైడ్ స్థాయిలు ఉన్నట్లు గుర్తించారు. అర్బన్ వేస్ట్ వాటర్, సెప్టింక్ ట్యాంక్ లీకేజీ, ఫెర్టిలైజర్ యూజ్, సీవేజ్ ఇన్ ఫిల్టరేషన్ ద్వారా హైదరాబాద్ భూగర్భ జలాలు కలుషితం అవుతున్నట్లు గుర్తించారు. అలాగే ఫ్లోరైడ్ స్థాయిలు కూడా గణనీయంగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ నీటిని తాగడం వల్ల పెద్దల కంటే పిల్లలకే అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+