418.. విడుదల వాయిదా: బిగ్ బ్యాంగ్ తో కమ్ బ్యాక్

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్.. 418. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సమర్పకుడు. ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 18వ తేదీన విడుదల కావాల్సి ఉందీ సినిమా. దీనికి అనుగుణంగా యూనిట్ ప్లాన్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి వీలుగా ప్రస్తుతానికి వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల విడుదలైన 418 ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కథాంశం కొత్తగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలతో పాటు క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగింది. దీనికి తోడు- ఎగ్జిబిటర్ల కోసం వేసిన ప్రత్యేక ప్రదర్శన తర్వాత ఇంకా హైప్ క్రియేట్ అయింది. ప్రత్యేకించి బాలీవుడ్ కు చెందిన ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఈ సినిమాకు అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ హారర్ థ్రిల్లర్‌ను హిందీ బెల్ట్ లో విడుదల చేయడానికి ఎగబడ్డారు.

418 Release Postponed Wider Multi-Language Run Coming This Time with a grand new date will be soon

దీంతో దక్షిణాది భాషలకే పరిమితం కాకుండా ఒకేసారి హిందీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు మేకర్స్. దీనికోసం కొంత సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని, పక్కా ప్రణాళికతో ఈ సినిమాను విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. త్వరలోనే నూతన విడుదల తేదీని వెల్లడిస్తామని, పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తామని తెలిపింది.

శివగామిని మించి పోయే రేంజ్ లో కమల రెడ్డి
శివగామిని మించి పోయే రేంజ్ లో కమల రెడ్డి

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. కీర్తన్ నడగౌడ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రశాంత్ నీల్ స్వయంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ లవర్స్‌లో మంచి బజ్ ఏర్పడింది. ఈ క్రేజీ హారర్ డ్రామా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోవడం సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

కన్నడ నటి ఛైత్ర జే అచార్ ఇందులో కీలక పాత్ర పోషించారు. సూర్య రాజ్ వీరబత్తిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, రమేష్ ఇందిర, శ్రీవైష్ణవి, శశాంక్ పాటిల్, కోట జయరాం, గోపరాజు విజయ్, శ్రీకాంత్ గణేష్, గోపి గవిరెడ్డి.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+