ఆగస్ట్ లో సింహరాశిలో సూర్య-కేతువుల అరుదైన కలయిక.. కొన్ని రాశులవారికి అదృష్టం!

గ్రహాల రాజు అయిన సూర్యుడు, నీడ గ్రహం, చెడు చేసే గ్రహం అయిన కేతువు సంయోగం ఆగస్ట్ నెలలో జరుగుతుంది. 2026 ఆగస్టు 17న సూర్యుడు తన స్వరాశి అయిన సింహంలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న కేతువుతో యుతి ఏర్పరుస్తాడు. ఈ సూర్య-కేతు సంయోగం సుమారు ఒక నెలపాటు కొనసాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యుతి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది.

సింహ రాశి: సూర్య కేతువుల యుతి మీ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి అత్యధిక లాభం మీకే కలుగుతుంది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త బాధ్యతలు రావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ లేదా ప్రభుత్వ రంగంలోని వారికి ప్రత్యేక అవకాశాలు వస్తాయి. ఇది సింహరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది.

Sun-Ketu conjunction forms in Leo Know how Simha and three other zodiac signs will get luck

కన్య రాశి: సూర్య కేతువుల యుతితో కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలు, పాత పెట్టుబడుల నుంచి లాభం కనిపిస్తాయి. పని ఒత్తిడి తగ్గి, కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి.ఈ సమయంలో ఏ పని చేసినా అన్ని విధాలాలబ్ది చేకూరుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కలిసి వస్తుంది.

మకర రాశి: సూర్య కేతువుల యుతితో మకర రాశి జాతకులకు కెరీర్‌లో స్థిరత్వం, ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది. ఆస్తి, భూమి సంబంధిత వ్యవహారాల్లో లాభం వస్తుంది . ఇది నిజంగా వీరికి సానుకూల ప్రయోజనాలను కలిగిస్తుంది. పని చేసే చోట అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ సమయం వీరికి ఆదాయం తెచ్చి పెడుతుంది.

గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి మూడురోజుల్లో జాక్ పాట్ మొదలు!
గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి మూడురోజుల్లో జాక్ పాట్ మొదలు!

ధనుస్సు రాశి: అనుకోని ధనలాభం, విదేశీ సంబంధాలు బలపడతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి.ఈ కాలంలో సూర్యుని శక్తి, కేతువు యొక్క ఆధ్యాత్మిక ప్రభావం కలిసి ఈ రాశుల వారికి లాభాలు, అదృష్టం తీసుకువస్తాయి. అయితే అహంకారం తగ్గించి, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. ఇది ధనుస్సు రాశి వారికి శ్రేయస్సు ఇస్తుంది. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఎర్ర రంగు వస్త్రాలు ధరించడం శుభ ఫలితాలను పెంచుతుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+