ఆ రెండు ఆలయాల్లో టీటీడీ జేఈఓ నిర్వహించిన తనిఖీల్లో..

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 87,179 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,256 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.59 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.

టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.03 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 3.11 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,538 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

JEO Directs Engineering Team to Finish Works on Schedule at Narayanavanam and Nagalapuram Temples

మరోవంక.. నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాల అభివృద్ధిపై టీటీడీ దృష్టి సారించింది. ఈ రెండు ఆలయాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లను చేపట్టాలని టీటీడీ జేఈవో శరత్ అధికారులను ఆదేశించారు. టీటీడీ అధికారులతో కలిసి ఈ ఆలయాలను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఖాళీ కడుపుతో ఈ టీ తీసుకోండి చాలు- ఇప్పుడిదే ట్రెండింగ్
ఖాళీ కడుపుతో ఈ టీ తీసుకోండి చాలు- ఇప్పుడిదే ట్రెండింగ్

పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని జేఈవో ఆదేశించారు.

టీటీడీకి రిలయన్స్ భారీ కానుక- బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయి అందుబాటులో..
టీటీడీకి రిలయన్స్ భారీ కానుక- బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయి అందుబాటులో..

భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కలిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దాతల సహకారంతో ఆలయాల్లో ప్రతిరోజూ భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల వివరాలపై శరత్ ఆరా తీశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు.

నాణ్యమైన అన్నప్రసాదాలను నిరంతరం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం వాహన మండపం, పోటు, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అదనపు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+