India vs Sri Lanka 1st Test: శ్రీలంకతో తొలిటెస్టుకు టీమిండియా ఎలెవెన్ ఇదే..!

శ్రీలంకతో ఈ నెల 15 నుంచి 19 వరకూ జరిగే తొలిటెస్టుకు (India vs Sri Lanka 1st Test) టీమిండియా సిద్దమవుతోంది. ఈ టెస్టులో టీమిండియాకు కెప్టెన్ శుభ్ మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా.. ఇతర స్ధానాలపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. లంకతో తొలిటెస్టులో టీమిండియా కూర్పు కోసం ఇప్పటికే పలు ఆప్షన్లు పరిశీలించిన మేనేజ్మెంట్ చివరికి ఓ తుది అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఈసారి పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 15న శ్రీలంకతో భారత్ తొలి టెస్టు ఆడనుంది. గత వారం శ్రీలంక క్రికెట్ ఎలెవన్ తో జరిగిన 3 రోజుల వార్మప్ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ పరిమితంగానే పాల్గొన్నప్పటికీ, బ్యాటింగ్ ఆర్డర్‌లో తన నాలుగో నంబర్ స్ధానంలోనే అతను బరిలోకి దిగబోతున్నాడు. ఈ సిరీస్‌కు గిల్ డిప్యూటీగా ఎంపికైన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమైంది. సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా నంబర్ 3 స్థానంలో కొత్తగా తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్ ను దింపే అవకాశాలున్నాయి. అతనికి దేవదత్ పడిక్కల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

India vs Sri Lanka 1st Test Shubman Gill to Lead No 3 Spot a Major Selection Dilemma

నాలుగో స్ధానంలో గిల్, ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా ఆడబోతున్నారు. ఏడవ స్థానంపై మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. శ్రీలంక టూర్ లో భారత జట్టులో ధ్రువ్ జురెల్ మరొక స్పెషలిస్ట్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఉన్నాడు. అలాగే సారాన్ష్ జైన్ ఆల్ రౌండర్ గా అందుబాటులో ఉన్నాడు. సారాన్ష్ స్పిన్-బౌలింగ్ ఆల్-రౌండర్, బ్యాటింగ్ కూడా చేసాడు. జురెల్, సారాన్ష్ ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకోవాలని నిర్ణయిస్తే, కుల్దీప్ యాదవ్ లేదా మానవ్ సుతార్ లో ఒకరు పెవిలియన్ కే పరిమితమవుతారు. సిరాజ్ పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. రెండో పేసర్ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ దార్ పోటీలో ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ కు దాదాపు ఖరారైందని భావిస్తున్న జట్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సరణాశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+