ఆఫీస్ లో ఆగ్నేయంలో కూర్చోవలసి వస్తే ప్రతికూలతలివే, పరిహారాలిలా!

ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదా? ఆఫీసుకు వెళ్లగానే మానసిక ఒత్తిడి, సహోద్యోగులతో అనవసర వాదనలు జరుగుతున్నాయా? అయితే, మీరు కూర్చునే సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరముంది. వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పని చేసే స్థలం యొక్క దిశలు మన ఆలోచనలను మరియు కెరీర్ ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి.

ఆగ్నేయదిశలో కూర్చుంటే ఎదురయ్యే ఇబ్బందులు

ఆఫీసులో ఆగ్నేయ దిశలో కూర్చోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వాటిని అధిగమించడానికి చేయాల్సిన మార్పులు ఏంటో చూద్దాం. వాస్తు శాస్త్రంలో ఆగ్నేయ దిశ 'అగ్ని' తత్వానికి ప్రతీక. ఈ దిశలో కూర్చుని పని చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆగ్నేయం వైపు ముఖం పెట్టి పని చేయడం వల్ల మానసిక ఆందోళనలు ఎదురై, పనిపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది.

Office seating directions are you sitting in north east in office know negative results remdies

కెరీర్‌లో అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయి?

తప్పుడు దిశలో కూర్చోవడం వల్ల ఏకాగ్రత లోపించి, ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, మీరు కూర్చున్న కుర్చీకి వెనుక బలమైన గోడ లేకుండా, ఖాళీ స్థలం లేదా కిటికీ ఉంటే, అది ఆఫీసులో మీకు దక్కవలసిన మద్దతును (సపోర్ట్‌ను) తగ్గిస్తుంది. దీనివల్ల పై అధికారులతో సత్సంబంధాలు దెబ్బతినడం, కెరీర్‌లో అనవసరమైన అడ్డంకులు ఏర్పడటం వంటివి జరగవచ్చు.

డెస్క్ మేనేజ్‌మెంట్‌తో పాజిటివ్ ఎనర్జీ

దురదృష్టవశాత్తూ ఆగ్నేయ భాగంలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటే, డెస్క్ మేనేజ్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా నెగెటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు. ఆగ్నేయ గది లేదా క్యాబిన్‌లో కూర్చున్నప్పటికీ, పని చేసేటప్పుడు మీ ముఖం మాత్రం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. ఈ దిశలు కొత్త ఆలోచనలకు, కెరీర్ వృద్ధికి ఎంతో అనుకూలమైనవి.

ప్రతికూలతల నుండి రక్షణ

మీ సీటు వెనుక భాగంలో ఎల్లప్పుడూ బలమైన గోడ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ గోడ లేకపోతే, మందపాటి కర్టెన్ లేదా కబోర్డ్ ఏర్పాటు చేసి వెనుక ఖాళీ స్థలం కనిపించకుండా కవర్ చేయండి. ఇది మీకు ఆఫీసులో ఒక రక్షణ కవచంలా పనిచేసి, మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ ఆఫీస్ టేబుల్‌పై ఈశాన్య మూలలో ఒక చిన్న క్రిస్టల్ గ్లోబ్ లేదా వాస్తు పిరమిడ్‌ను ఉంచడం వల్ల, అది ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుంది.

మొక్కలు మరియు రంగుల ప్రాముఖ్యత

మీ డెస్క్ పైన చిన్న మనీ ప్లాంట్ లేదా లక్కీ వెదురు మొక్కను ఉంచండి. ఈ పచ్చని మొక్కలు అగ్ని తత్వంలోని వేడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయి. ఆగ్నేయం అగ్ని స్థానం కాబట్టి, మీ డెస్క్, క్యాబిన్ గోడలు లేదా టేబుల్ మ్యాట్‌ల కోసం ఎరుపు రంగును ఉపయోగించవద్దు. దానికి బదులుగా తెలుపు, లేత ఆకుపచ్చ లేదా లేత పసుపు రంగులను ఎంచుకోవడం ఉత్తమం.

2026లో రెండవ అరుదైన సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి కనకవర్షం!
2026లో రెండవ అరుదైన సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి కనకవర్షం!

సీటింగ్ పొజిషన్‌లో మార్పులతో ఒత్తిడికి చెక్

ఈ చిన్న మార్పులు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆఫీసులో మీ సీటింగ్ పొజిషన్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసర ఒత్తిడిని దూరం చేసుకుని, పూర్తి ఏకాగ్రతతో పని చేస్తూ కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+