ప్రబోధిని ఏకాదశి: నేడు ఈ పనితో మీరే కోటీశ్వరులు!
ప్రబోధిని ఏకాదశి నేడు. ఇది చాలా విశిష్టమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే ఈ ప్రత్యేకమైన రోజునే దేవ ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. నేటితో చాతుర్మాసం ముగిసింది. ఈ సంవత్సరం, ప్రబోధిని ఏకాదశి నవంబర్ 1న నేడు వచ్చింది. ప్రబోధిని ఏకాదశి, ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది నాలుగు నెలలు నిద్రించిన శ్రీ మహా విష్ణువు మేల్కొనే పర్వదినం.
ప్రబోధిని ఏకాదశి చాలా విశేషమైనది
నాలుగు నెలల పాటు సాగే చాతుర్మాస సమయం తరువాత, నిద్రలో ఉన్న శ్రీ మహా విష్ణువు నేడు మేల్కొంటాడు. ఆ సమయంలోనే ప్రబోధిని ఏకాదశి నాడు తులసి వివాహం చేసుకుంటుంది. నాలుగు నెలల ముందు దేవ శయన ఏకాదశి రోజున, విష్ణువు నిద్రపోతాడు. అప్పుడి మొదలైన శ్రీమహా విష్ణువు యోగ నిద్ర నేటితో ముగుస్తుంది. కాబట్టి, ప్రబోధిని ఏకాదశి అనేది విష్ణువు మేల్కొలుపును వేడుకగా జరుపుకునే ప్రత్యేకమైన రోజు.

కడిమి చెట్టు పూజతో ఊహించని ఫలితం ఉంటుంది
ఈ ప్రబోధిని ఏకాదశి నాడు కొన్ని పనులు అంతా శుభమే జరుగుతుంది. ఈ రోజు చేసే పనులతో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ప్రబోధిని ఏకాదశి చాలా ప్రత్యేక ఏకాదశి. నేడు కదంబ వృక్షం లేదా కడిమి చెట్టును పూజించడం చాలా మంచిది. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. కదంబ వృక్షం అనేది దేవతా వృక్షం. మన పురాణాలలో కదంబ వృక్షానికి సరైన ప్రాధాన్యత ఉంటుంది.
ఈ చెట్టు కృష్ణుడికి చాలా ఇష్టం
హిందూ పురాణాలలో కదంబ వృక్షానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శ్రీ కృష్ణుడికి కదంబ వృక్షం అంటే ఎనలేని మక్కువ. శ్రీ కృష్ణుని కోసం గోపికలు వెతుకుతుండగా, ఆయన కదంబ వృక్షం క్రింద వేణువు వాయిస్తూ కనిపించారట. అప్పటివరకు కృష్ణుని చూడక దుఃఖితులైన గోపికలు ఆయనను చూసి సంతోషం పొందారని చెప్తారు. ఈ చెట్టు అంటే శ్రీ కృష్ణుడికి చాలా ప్రత్యేకం అని చెప్తారు.
ప్రబోధిని ఏకాదశి నాడు పూజ ఇలా చేస్తేనే ఫలితం
అందుకే ప్రబోధిని ఏకాదశి నాడు ఎవరైతే కదంబ వృక్షాన్ని భక్తితో పూజలు చేస్తారో , ప్రతిఫలంగా వారు సంపదలు పొందవచ్చని చెప్తారు. ప్రబోధిని ఏకాదశి నాడు, మీరు కదంబ చెట్టుకు కొద్దిగా పసుపు, కుంకుమ మరియు కొన్ని పువ్వులను తీసుకొని పూజలు చేస్తే , శ్రీ మహా విష్ణువు మీద మనసు లగ్నం చేసి పూజలు చేస్తే అది మీకు సత్ఫలితాలను ఇస్తుందని చాలా మంది నమ్ముతారు.
విష్ణువు కటాక్షం కోసం ఇలా చెయ్యండి
ఎవరైతే నేడు కదంబ వృక్షాన్ని పూజిస్తారో వారికి జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని, ధనప్రాప్తి కలుగుతుందని చెప్తారు. కాబట్టి నేడు ప్రబోధిని ఏకాదశి నాడు కదంబ వృక్షం వద్దకు వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చెయ్యండి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషాన్ని, సుఖ శాంతులను ఇస్తుంది. విష్ణువు దయతో మీకు సకల సౌఖ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
ఇంట్లో వాస్తు దోషాలున్నాయని ఎలా తెలుస్తుంది? -
120 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం -
వాస్తు ప్రకారం మెయిన్ రోడ్డు పక్కన ఉండే ఇళ్లల్లో ఉండొచ్చా? -
శని కుజుల ద్వి ద్వాదశ యోగం మొదలైంది.. ఈ రాశులవారికి సంపదలు డబుల్! -
ఈ నెల 11 తర్వాత ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంది -
శుక్ర శనిదేవుల యుతి.. మార్చిలో ఈ రాశులవారికి సంపదల ప్రాప్తి -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
Today rashiphalalu:నేడు నక్కతోక తొక్కి జాక్ పాట్ కొట్టే రాశులవారు వీరే! -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!!












Click it and Unblock the Notifications