శతభిషా నక్షత్రంలో రాహువు సంచారంతో ఈ రాశులకు రాజయోగం

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. సాధారణ గ్రహాలకు భిన్నంగా, రాహువు ఎప్పుడూ తిరోగమన దిశలో మాత్రమే కదులుతాడు. జాతకంలో రాహువు స్థాన మార్పు 12 రాశులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 మే 31న రాహువు శతభిషా నక్షత్రం రెండవ పాదం నుండి మొదటి పాదంలోకి మారనున్నాడు. 64 రోజుల పాటు ఈ నక్షత్ర పాదంలో సంచరిస్తాడు.

మూడు రాశులకు లబ్ది చేకూర్చే రాహువు

ఈ రాహువు కదలిక మూడు రాశులకు అపారమైన అదృష్టాన్ని, రాజయోగాన్ని అందిస్తుంది. వీరికి కెరీర్ పురోగతితో పాటు అనూహ్య ఆర్థిక లాభాలుంటాయి. అయితే రాహువు అనుగ్రహం లేని వాళ్ళు రాహువు అనుగ్రహం కోసం పేదలకు నల్ల నువ్వులు, ఆవ నూనె లేదా నల్లటి వస్త్రాలు దానం చేయాలి. జంతువులకు ఆహారం పెట్టడం వల్ల రాహువు శాంతిస్తాడు. ముఖ్యంగా నల్ల కుక్కకు రొట్టెలు, పక్షులకు గింజలు, నీరు అందించడం శుభప్రదం.

Rahu Transit in Shatabhisha Nakshatra on may 31st Luck and good fortune For these Zodiac signs

మిథునరాశి

రాహువు సంచారం మిథున రాశి వారికి వరం. మిధున రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు, వేతన పెంపునకు అవకాశాలుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దక్కుతుంది. వ్యాపారస్తులు భారీ ఒప్పందాలతో వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

తులారాశి

ఈ సంచారం తులారాశి వారికి కెరీర్‌లో కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు, ఉన్నత అధికారాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిలిచిపోయిన సొంత డబ్బు తిరిగి అందుతుంది. కోర్టు వివాదాలు తొలగి, పూర్వీకుల ఆస్తి లాభిస్తుంది. కుటుంబంలో విభేదాలు తగ్గి సామరస్యం, ప్రేమ రెట్టింపవుతాయి.

కుంభరాశి

రాహువు మార్పు కుంభ రాశి వారికి కీలకం. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న విజయం 64 రోజుల్లో లభిస్తుంది. కార్యాలయంలో వారి కృషిని సీనియర్లు గుర్తిస్తారు; అప్రైజల్, జీతం పెరుగుతుంది. వ్యాపారస్తులు పెద్ద ప్రాజెక్టులు దక్కించుకుని భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

గురు చంద్ర పరివర్తన యోగంతో జూన్ లో వీరి దశ తిరుగుతోంది!
గురు చంద్ర పరివర్తన యోగంతో జూన్ లో వీరి దశ తిరుగుతోంది!

ఇలా చేస్తే రాహు దోషం పోతుంది

రాహువు దుష్ప్రభావాలకు పరిహారాలు చూస్తే జాతకంలో రాహువు బలహీనంగా ఉండి అశుభ ప్రభావాలు చూపుతుంటే, వాటిని తగ్గించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలున్నాయి. రాహు దోష నివారణకు శివుడిని, కాలభైరవుడిని పూజించాలి. ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేస్తే రాహు దోషాలు తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+