వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైశాఖ పూర్ణిమ బుద్ద జయంతి

బుద్దుని జీవిత కాలంలో వైశాఖ పూర్ణిమ మూడు సారులు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది. అతడు ఒకానొక వైశాఖ పూర్ణిమనాడు పుట్టువు నందాడు.

By Pratap
|
Google Oneindia TeluguNews

బుద్దుని జీవిత కాలంలో వైశాఖ పూర్ణిమ మూడు సారులు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది. అతడు ఒకానొక వైశాఖ పూర్ణిమనాడు పుట్టువు నందాడు. మరి ఒక వైశాఖ పూర్ణిమనాడు అతడు బుధుడు అయ్యాడు. వేలొక వైశాఖ పూర్ణిమనాడు అతడు నిర్యాణము చెందాడు. ఈ విషయాన్ని సూర్యప్రకాశ అనువారు స్టేట్సుమెన్ పత్రికలో ఒక కథగా ఇట్లా చెబుతున్నారు.

గౌతముని బుద్దునిగా చేసిన బోధివృక్షము పూజా భాజనమైంది. వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షానికి పూజచేసే ఆచారం బుద్దుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు మకాము చేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పువ్వులు తెచ్చారు. కాని ఆసమయంలో బుధుడు ఎక్కడికో వెళ్లి ఉన్నాడు.

Astrologer explained that importance of Vaishakha Budha Purnima.

భక్తులు బుద్దుని దర్శనం కోసము చాలాసేపు వేచి ఉన్నారు. ఎంత సేపటికిన్నీ బుద్దుడు రాలేదు. బుద్దుని దర్శనం కాక భక్తులు నిరుత్సాహులై ఆ పువ్వులు అక్కడే వదలి వేసి వెళ్లిపోయారు. బేతవన విహారదాత అనంత పిండకుడు పరిస్థితి చూచాడు. పూజకు వినియోగం పుష్పాలు అట్లా అక్కడ నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. కాగా బుద్ధుడు రావడంతోటే అనంత పిండికుడు ఈ విషయం చెప్పాడు. అతను లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు.

శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలు అతను ఒప్పకోలేదు. బోధివృక్షం పూజకు మాత్రం అతను అనుమతించాడు. తన జీవితకాలంలోనూ, తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని అతడు చెప్పాడు. అందుమీద బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుండి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన ఉద్యోగులతో, అనుచరులతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు వచ్చారు.

ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులలో ప్రబలింది. ఆ పూజ ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారమైంది. ఇప్పడు బౌద్దమతం ప్రబలి ఉన్న అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతూ ఉంది.
ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి, దీపాలు పెట్టి మొదట్లో పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్దమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం ఈనాటికిన్నీ చూడతగి ఉంటుంది.

రంగూను, పెగు, మాండలేమన్నగు బర్మాబస్తీల్లో ఈ పండుగను నితాంత వైభవంతో చేస్తారు. ఈ ఉత్సవం కొంచెం ఇంచుమించు రోజల్లా ఉంటుంది. ప్రతి ఇంటిలోని స్త్రీలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు ఉంటాయి. వెనకనుంచి దీపాలు, జెండాలు పట్టుకు వస్తారు. బస్తీ నాలుగు మూలలనుంచీ ఇట్లా బయలు దేరిన ఉత్సవాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి.

సమ్మర్ణదారుణమైన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. లోపలి దేవాలయానికి ముమ్మారు ప్రదక్షిణం చేస్తారు. ఆ మీద కుండల్లో నీరు వృక్షం మొదట్లో పోస్తారు. దీపాలు వెలిగిస్తారు. చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించు 'వట సావిత్రి' మున్నగు వ్రతాలు ఈ బౌద్ద పర్వం ఛాయవే అని అంటారు.

English summary
Astrologer explained that importance of Vaishakha Budha Purnima.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X