వాస్తు ప్రకారం సాయంత్రం సమయంలో చేయకూడని పనులు ఇవే

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి జీవితాంతం కొలువై ఉండాలని కోరుకుంటారు. దీనికోసం అనేక శాస్త్రాలను అనుసరిస్తారు. ఇందులో వాస్తు కూడా ఒకటి. సాయం సంధ్యా సమయం అనేది చాలా కీలకం. ఆ సమయంలో లక్ష్మీదేవి మన ఇళ్లల్లోకి అడుగుపెడుతుందనే నమ్మకం అందరిలో ఉంటుంది. వాస్తు ప్రకారం సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని పనులు చేయకూడదు. వాటి వివరాలను తెలుసుకుందాం.

ఇల్లు ఊడ్చవద్దు.
తడిగుడ్డతో తుడవడం మహా దోషం.
ఆ సమయంలో తుడిస్తే లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే.
చీపురును ఓ మూలన దాచిపెట్టలి.
ఇలా చేయకపోతే సంపద నిలవదు.

These are the things that should not be done in the evening according to Vastu

చీకటి పడిన తర్వాత ఉప్పును దానం చేయకూడదు.
దీనివల్ల మన ఇంట్లోని సుఖ సంతోషాలకు, ఆర్థిక స్థిరత్వానికి ఆటంకం కలుగుతుంది.
సూర్యాస్తమయం తర్వాత డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే తీసుకోకూడదు.
దీనివల్ల ఆర్థిక కష్టాలుంటాయి.
మంగళవారం డబ్బులు చేతులు మారకుండా చూసుకోవాలి.

సాయంత్రం నిద్రపోతే ఇంట్లోకి పేదరికం, బద్దకం ప్రవేశిస్తాయి.
ఆ సమయంలో పూజాగదిలో దీపం వెలిగించాలి.
లక్ష్మీదేవిని పూజించడంవల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

సాయంత్రం తర్వాత తులసి మొక్కను తాకకూడదు.
ఆకులు కూడా కోయకూడదు. నీళ్లు కూడా పోయకూడదు
లక్ష్మీదేవి తులసిమొక్కలో నిద్రిస్తుంది. ఆ సమయంలో ఆమె నిద్రకు భంగం కలిగించకూడదు
తులసి పూజలు పగలే జరగాలి.

లక్ష్మీదేవి నివసించేవి 96 స్థానాలు
పసుపు, కుంకుమ, వస్త్రాలు, రత్నాలు, ముత్యాలు, బంగారం, వెండి, రాగి... ఇలా చాలా ఉంటాయి.
ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+