బృహస్పతి సంచారంతో ఏడాదిపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు
ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా చేయడంవల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. బృహస్పతి సంచారంవల్ల జీవితాల్లో మార్పులు వస్తుంటాయి. గతనెల ఒకటో తేదీన రాశి సంచారం చేసిన గురుడు 2025 మే 14 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా లాభాలు కలగనున్నాయి. ఏయే రాశులవారు లాభపడుతున్నారు? వారికి ఏ విధంగా కలిసివస్తుంది? ఎటువంటి ప్రయోజనాలు దక్కనున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారికి గురుడి సంచారంవల్ల ఏడాదిపాటు లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటుచేసుకోవడంతోపాటు వైవాహిక జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మిత్రుల మధ్య ఉన్న అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడటంవల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యం వర్ధిల్లుతాయి.

వృషభ రాశి
కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. ఆర్థికంగా విపరీతమైన మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు. వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలించి అన్ని పనులు సులువుగా జరుగుతాయి.
కర్కాటక రాశి
పనుల్లో ఆటంకాలు తొలగిపోవడంతోపాటు అనుకున్న పనులు సులభంగా నెరవేరతాయి. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు వారి కోరిక నెరవేరుతుంది.
-
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications