2025లో వీరే మహర్జాతకులు.. నా మాటే నిజమన్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి
2025 సంవత్సరం దగ్గరకు వస్తుంది. 2025 సంవత్సరంలో ఏ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే 2025 లో ఎవరి జాతకం బాగుంది అనేది ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి వెల్లడించారు. 2025 లో ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఎవరు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు? అనేది వేణు స్వామి జ్యోతిష్య అంచనాల ప్రకారం ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి
2025 లో వృషభ రాశి వారికి శనిదేవుడు సానుకూలంగా ఉంటాడని పేర్కొన్నారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి సానుకూలంగా ఉంటుందని వ్యాపారాలలో భారీ లాభాలు వస్తాయని పేర్కొన్నారు. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం ఉందని వృషభ రాశికి చెందినవారు ఈ సమయంలో విపరీతమైన లాభాలు చూస్తారని తెలిపారు.

మిధున రాశి
మిధున రాశి వారికి 2025 లో అన్ని విధాల అనుకూలంగా ఉండబోతుందని వేణు స్వామి పేర్కొన్నారు. ఈ రాశి వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతుందని దీని కారణంగా ఏ పని చేసినా విజయాలు వరిస్తాయని, విపరీతమైన ధన లాభం కలుగుతుందని చెప్పారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయని పేర్కొన్నారు. గురుబలం వల్ల వీరికి సమాజంలో మంచి పేరు వస్తుందన్నారు.
కన్య రాశి
కన్యా రాశి వారికి 2025 లో అనుకూలంగా ఉండబోతుందని ధన లాభం కలుగుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యం బాగుంటుందని, గృహ, వాహన, ఆస్తిలాభాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. కన్యారాశిలో ఉన్న వ్యాపారులు భారీ లాభాలను పొందుతారని, ఉద్యోగాలు చేసేవారు, ప్రమోషన్లు పొందుతారని తెలిపారు. కన్యారాశికి చెందిన వారికి ఈ సంవత్సర అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు.
మకర రాశి
2025లో మకర రాశి జాతకులకు ఏలినాటి శని వెళ్లిపోవడం కారణంగా వీరి కష్టాలకు విముక్తి లభిస్తుంది. మకర రాశి వారికి విపరీతమైన అనుకూలతలు, రాజయోగం పట్టుకోనున్నాయి. ఇది మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన సమయం. రాజకీయాల్లో ఉన్నవారికి పెద్ద పదవులు వరిస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు. భారీ ప్రయోజనాలను పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications