మే 15 వరకు ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే
జాతకంలో, గ్రహ సంచారంలో రవి, శని ఒకేసారి మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచరించడం అనేది అరుదుగా జరుగుతుంది. కష్టనష్టాల నుంచి బయటపడటానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ రెండు గ్రహాలు బలంగా ఉండాలి. ఇలా ఉండటంవల్ల మే 15వ తేదీ వరకు కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు శని దోషం నుంచి, ఇతర కష్టనష్టాల నుంచి బయటపడనున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
కర్కాటకం
డబ్బు చేతికి అందక ఇబ్బందులు పడుతుంటే వీరికి అనేక వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నాయి. అలాగే హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రతిష్టంభన తొలగుతుంది. పిల్లలకు సంబంధించిన శుభకార్యాలు వింటారు. ఆదాయానికి ఇబ్బంది లేదు.

సింహం
ప్రధానమైన పనుల్లో ఆటంకాలు, విఘ్నాలు ఎదురవుతుంటాయి. పనులన్నీ పెండింగ్ లో ఉంటాయి. అలగే జరగాల్సిన శుభకార్యాలు కూడా జరగవు. రావల్సిన సొమ్ము చేతికి అందదు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. జీతభత్యాల పెరుగుదల ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
వృశ్చికం
కుటుంబపరంగా సమస్యలు పెరుగుతాయి. ప్రతి పని ఆలస్యం అవుతుంది. ఈ పరిస్థితులు మారిపోయి అన్ని పనులు వేగంగా జరుగుతుంటాయి. ఆర్థికంగా లబ్ది పొందుతారు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఏర్పడటంతోపాటు కుటుంబం వృద్ధి చెందుతుంది.
మకరం
ఒత్తిళ్లు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు చోటుచేసుకుంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ప్రమోషన్లు ఉన్నాయి. శుభవార్తలు వింటారు.
మీనం
వైద్యఖర్చులు పెరుగుతాయి. శత్రువులు, పోటీదార్లు వెనుకంజ వేస్తారు. ఏలిననాటి శని దోషం తగ్గుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఏ ప్రయత్నమైన వెంటనే నెరవేరుతుంది. వృత్తిలో, వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవకార్యాలు పెరుగుతాయి.












Click it and Unblock the Notifications