బుధుడి కదలికలతో ఈ రాశులకు డబ్బే డబ్బు
జ్యోతిష్యం ప్రకారం బుధుడు మేథస్సుకు సూచిక. బుధుడు సంచారం చేసినప్పుడల్లా ఆర్థికంగా, వృత్తిపరంగా కీలక మార్పులు జరుగుతుంటాయి. ఈనెల 25వ తేదీన బుధుడు మిథునరాశిలో సంచరించనున్నాడు. దీనివల్ల మూడు రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు దక్కనున్నాయి. ఆదాయంలో అనేక మార్పులు చోటుచేసుకోవడంతోపాటు పాత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ సమయంలో ఏ రాశివారికి ఎటువంటి ప్రయోజనం దక్కుతుంది? ఎటువంటి లాభాలున్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
పనుల్లో సానుకూలత చోటుచేసుకుంటుంది. సులువుగా విజయాలు సాధిస్తారు. గతం నుంచి ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. పనితీరులో మార్పు వస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు చేయడంవల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుకుంటారు. వ్యాపారస్తులకు భారీ స్థాయిలో ఆర్డర్లు వస్తాయి. బ్యాంకు ఖాతాలో నగదు నిల్వలు పెరుగుతాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.

సింహ రాశి
కొందరికి విపరీతమైన ప్రయోజనాలున్నాయి. కొందరికి మిశ్రమ లాభాలుంటాయి. జీవిత లక్ష్యాలపై శ్రద్ధ పెట్టాలి. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. అందుకు అదృష్టం తోడుంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలం. వీరి పురోగతికి కూడా ఈ సమయం తోడ్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతోపాటు అందరిమధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి.
మకర రాశి
ఆందోళన తగ్గిపోతుంది. ఎటువంటి పనులైనా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంది. కొత్త అవకాశాలు రావడంతోపాటు ఉన్నచోట వేతనాలు పెరుగుతాయి. కొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి.












Click it and Unblock the Notifications