సెప్టెంబరు 2 ప్రత్యేకత తెలుసా?.. ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్యం ప్రకారం, హిందూ శాస్త్రం ప్రకారం భాద్రపద అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి భాద్ర పద అమావాస్య వచ్చేనెల రెండోతేదీన రావడం సంభవించింది. వాస్తవానికి ఆరోజు మన పూర్వీకుల ఆత్మశాంతి కోసం, పితృదోషాల నుంచి వారికి విముక్తి కల్పించడం కోసం పిండ ప్రదానం చేయడంతోపాటు ఇతర కార్యక్రమాలు చేపట్టేవారు.

దీనివల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుందని పండితులు చెబుతున్నారు. అదేరోజు సంపదకు కారకుడైన శుక్రుడు నక్షత్ర సంచారం చేయనున్నాడు. అమావాస్య రోజు నక్షత్ర సంచారం చేయడంవల్ల ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. ఆదాయం పెరగడంతోపాటు డబ్బుకు సంబంధించిన విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

these zodiac signs will get more money due to bhadrapada amavasya on september 2nd

సింహ రాశి
ఈ రాశివారికి ఆ రోజు నుంచి ఆస్తులు లభిస్తాయి. అదనపు ఆదాయం పెరగడంతోపాటు సంపాద పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. వారికి లాభాలు వస్తాయి.

కన్యారాశి
ఈ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో సులువుగా విజయం సాధించడమే కాకుండా భారీమొత్తంలో డబ్బును పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన సహకారం లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. అమావాస్య నుంచి ఆర్థిక సమస్యలకు విముక్తి కలుగుతుంది. వ్యాపారస్తులు మంచి విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది.

మకర రాశి
శుక్రుడి నక్షత్ర సంచారం వీరికి ఎంతో మేలు చేస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు విజయవంతంగా చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. దీనివల్ల వారు బిజీగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. రుణ సమస్యలు తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+