కుబేర యోగంతో ఈ రాశులు కోటీశ్వరులవుతారు
జ్యోతిష్యంలో బృహస్పతి సంచారం అతి ప్రధానమైనది. ఏడాదికి ఒకసారి గురువు తన పరివర్తనను మారుస్తుంటాడు. వృషభరాశిలోకి మే ఒకటోతేదీన ప్రవేశించిన గురువు వచ్చే సంవత్సరం మాత్రమే పరివర్తన చెందుతాడు. అటువంటి సమయంలో కొన్ని రాశులవారికి దరిద్రం పట్టినట్లు అదృష్టం పట్టుకుంటుంది. ఒకరకంగా వారు పట్టుకుందల్లా బంగారంలా మారుతుంది. గురువు సంచారంవల్ల సంపద వద్దన్నా వచ్చి పడుతుంది. అందరూ సుభిక్షంగా ఉంటారు. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కుబేర యోగం కొన్ని రాశులవారికి గురువు సంక్రమించిన వెంటనే ఏర్పడుతుంది. దీనివల్ల వచ్చే సంవత్సరం వరకు వీరికి ధనానికి సంబంధించిన సమస్యలు ఎదురుకావు.

సింహరాశి
కుబేర యోగం ఈ రాశివారికి ఎంతో మేలు చేస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశాల నుంచి కాంట్రాక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. గురువు అనుకూల ప్రభావంవల్ల ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కన్యారాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. కార్యాలయంలో ప్రమోషన్ వస్తుంది. ప్రధానమైన పనులు చేపట్టేందుకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సంతోషంతోపాటు సంపద లభిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలుంటాయి. పిల్లలద్వారా శుభవార్తలు వింటారు.
వృషభరాశి
కీర్తికి అధిపతి అయిన గురుడు వృషభరాశిలోకి ప్రవేశించడంవల్ల కుబేర యోగం ఫలిస్తుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఖర్చులను నియంత్రించుకోవాలి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు.












Click it and Unblock the Notifications