తీవ్రమైన నష్టాలకు గురవుతున్న రాశులు ఇవే
జ్యోతిష్యం ప్రకారం శనిని న్యాయ దేవతగా పిలుస్తారు. కర్మలకు అధిపతి. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పని చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు. తన స్థానం మార్చుకున్నప్పుడల్లా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. శని మకర రాశి, కుంభ రాశులకు అధిపతిగా ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనివల్ల ఈ రాశివారితోపాటు కర్కాటక రాశివారిపై కూడా ప్రభావం పడుతుంది. ఒక రాశి నుంచి మరో రాశికి శని సంచారం చేయాలంటే రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా శని సడేసతిని ఎదుర్కొంటారు. ఏయే రాశులవారికి ఏవిధంగా ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
శుభంలో శుభ ఫలితాలు..
జన్మరాశిలో శనిదేవుడు ఉచ్ఛస్థితిలో ఉంటే అనేక ఫలితాలు కలుగుతాయి. జీవితానికి ఎదురవుతున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. జాతకంలో శనిదేవుడు శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు, అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి, వృశ్చిక రాశులవారు ఏలిన నాటి శని నుంచి వారికి ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం.

అన్ని రాశులూ తిరగడానికి 30 సంవత్సరాలు
శని రాశి సంచారాన్ని అరుదుగా చేస్తుంటుంది. అన్ని రాశుల చుట్టూ శని తిరగడానికి దాదాపు 30 సంవత్సరాల సమయం పడుతుంది. 2023 జనవరి 17నమకర రాశిని వదిలిపెట్టి కుంభ రాశిలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది మార్చి 29న కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. 2025 సంవత్సరంలో ఏలినాటి శని నుంచి కర్కాటక, వృశ్చిక రాశివారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం మకరరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. కుంభరాశిలో శని అర్ధ, శని రెండో దశ, మీనరాశిలో శని ప్రథమార్ధంలో ఉండటంవల్ల జాతకస్తులకు బాగానే ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు.












Click it and Unblock the Notifications