ఈ రాశులపై శని దేవుడి చల్లని చూపుతో ఊహించని ధనలాభం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత ప్రధాన గ్రహమైన శని ఈనెల రెండోతేదీ నుంచి వక్ర గమనంలో సంచారం చేస్తున్నాడు. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనం చేస్తున్నాడు. నవంబరు ఒకటో తేదీ తర్వాత శనిదేవుడు తిరోగమన దిశ నుంచి సాధారణ స్థితిలోకి రాబోతున్నాడు. దీనివల్ల ఈ ఐదు నెలల కాలం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఏయే రాశులవారికి ఏ విధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి
వీరికి ఆదాయాన్ని కల్పించే లాభస్థానంలో శని తిరోగమనం చేస్తున్నాడు. దీనివల్ల వీరికి భారీగా ఆదాయం పెరుగుతుంది. ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడటంతోపాటు గత పెట్టుబడుల నుంచి ఈ సమయంలోనే మంచి రాబడులు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది.

వృషభ రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలుండటంతోపాటు వారు ఊహించనిరీతిలో లాభాలను అందుకోనున్నారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్ని పరిణామాలు అనుకూలంగా జరుగుతాయి.
కన్య రాశి
ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. ఆదాయ వనరులు పెరగడంతోపాటు సహచర ఉద్యోగులతోపాటు పై అధికారులతో కూడా స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. కార్యాలయంలో అనుకున్న పనిని సులభంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో లాభసాటిగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
వృశ్చిక రాశి
శని తిరోగమనం అనేది ఈ రాశివారికి వరం లాంటిది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. కొత్తగా ఆదాయ మార్గాలు తోడవుతాయి. ఖాతాల్లో సొమ్ము పెరగడంతోపాటు వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులు ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
కుంభ రాశి
వీరు అన్నిరంగాల్లో విజయం సాధిస్తారు. సాహసోపేతంగా, ధైర్యం పనులు చేస్తారు. ఉద్యోగంలో పనితీరుతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ధనానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications