అక్టోబరు 3వ తేదీ నుంచి ఈ రాశుల జాతకం పూర్తిగా మారిపోతుంది!
అక్టోబరు నెలలో ఆరు కీలక గ్రహాలు సంచారం చేస్తున్నాయి. కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శని, సంపదకు కారకుడయ్యే శుక్రుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు, కుజుడు, గ్రహాలకు అధిపతి సూర్యుడు రాశులను మారుస్తున్నారు. బుధుడు రెండుసార్లు అక్టోబరులో సంచారం చేస్తాడు. దీనివల్ల ఆరు సంచారాలవుతాయి. మొత్తం అన్ని రాశులపై ఈ ప్రభావం ఉన్నప్పటికీ మూడు రాశులకు మాత్రం బాగా కలిసిరానుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఉద్యోగులకు వేతనం పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంపత్య జీవితం సంతోషంతో సాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది. ఒకరకంగా అక్టోబరు నెల ఈ రాశివారికి అదృష్టాన్ని మోసుకొస్తుంది.

కుంభ రాశి
జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ కలిసే ఏ పని చేయాలో ఆలోచించి నిర్ణయించుకుంటారు. నలుగురికి అన్యోన్యంగా నిలుస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కెరీర్ పరంగా ఊహించనిరీతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు పూర్తిచేస్తారు. విజయాన్ని సాధిస్తారు.
సింహరాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. వారి మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలుంటాయి. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుతుంది. డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఎదుటివారితో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు. మౌనంగా ఉండటమే మీకు కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications