నవ పంచమి రాజయోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు శనిదేవుడు. ఆయన న్యాయదేవుడు. న్యాయంగా ఉన్నవారికి రెట్టింపు మంచి ఫలితాలనే ఇస్తాడుకానీ అందరూ అనుకున్నట్లుగా ఆయన కీడు తలపెట్టడు. ఈనెల 24న శ్రావణ అమావాస్య. ఆరోజు శనిదేవుడు, సూర్యుడు 120 డిగ్రీల కోణంలో కలుసుకోబోతున్నారు. వీరిద్దరిదీ తండ్రీ కొడుకుల అనుబంధం. ఇలా కలుసుకోవడంవల్ల నవపంచమి రాజయోగం ఏర్పడింది. ఆర్థిక సమస్యల నుంచి కొన్ని రాశులను బయటపడేస్తోంది ఈ యోగం. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
తులా రాశి
జీవితంలో ఇంతవరకు ఏనాడూ పొందని ఆదాయాన్ని పొందుతారు. సంపాదన పెరుగుతుంది. మంచి లాభాలను కళ్లచూస్తారు. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బలోపేతమవుతారు. జీవతంలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగస్థులకు వారి వారి కార్యాలయాల్లో మంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారాల్లో మంచి పురోగతితోపాటు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది.

వృశ్చిక రాశి
ఈ రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని, శని దేవుడిని పూజించాలి. భారీ మొత్తంలో వ్యాపారస్తులు ఆదాయాన్ని ఆర్జిస్తారు. దాంపత్య జీవితంలో కొన్నాళ్లుగా ఉన్న సమస్యలన్నింటి నుంచి విముక్తి లభిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని, భౌతిక సుఖాలను పొందుతారు. డబ్బును పెట్టుబడిగా పెట్టాలని ఆలోచిస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. పెద్దల సలహా, సీనియర్ల సలహా తీసుకొని పెట్టుబడి పెట్టాలి.
మేష రాశి
ఉద్యోగస్థులకు చాలా బాగుంది. ఏ పని తలపెట్టినా విజయవంతమై పదోన్నతి కలుగుతుంది. వేతనాలు కూడా భారీగా పెరుగుతాయి. సంపాదన పెరగడంతోపాటు ఆదాయ వనరులు అదనంగా దొరుకుతాయి. అంతేకాకుండా పనిలో తమ ప్రత్యర్థులను ఓడించే శక్తిని వీరు కలిగివుంటారు. ఒకరకంగా ఈ సమయంలో ఈ రాశివారు కోట్లరూపాయలను ఆర్జిస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications