ఈ నెల 30న మహా సంయోగం.. ఈ రాశుల పంట పండింది!

గ్రహాల రాకుమారుడు బుధుడు ఈ నెల 30వ తేదీన సింహరాశిలోకి సంచారం చేస్తాడు. ఆ సమయానికి గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, ఛాయా గ్రహమైన కేతువు ఆ రాశిలోనే సంచారం చేస్తుంటారు. ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకోవడంవల్ల కొన్ని శుభ ఫలితాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారికి అది లాభదాయకంగా ఉంటుంది? వారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
ప్రేమలో ఉన్నవారి జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. కెరీర్ లో వృద్ధి సాధిస్తారు. అలాగే వ్యాపారం కూడా కలిసివస్తుంది. పాత మిత్రుల సహాయంతో కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. దీనివల్ల భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది. మార్కెటింగ్, రచన రంగాల్లో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి సమయం. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడానికి అనువైన సమయం.

three zodiac signs will get amazing benefits and huge money due to three planets conjunction in leo from this month 30th

ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రేమలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. ఇరువైపుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావు. పెండింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడే బలంగా ఉంటారు. వ్యాపారస్తులకు మంచి ఆర్జన ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహాను కచ్చితంగా పాటించాలి. లేదంటే నష్టపోతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బుధుడిని, కేతువును, సూర్యుడిని పూజించాలి.

కర్కాటక రాశి
కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. గతంలో ఉన్న మిత్రులు ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తను వింటారు. అంతేకాకుండా ప్రతి పనిలోను మంచి ఫలితాలను అందుకుంటారు. జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించినవారు మంచి లాభాలను ఆర్జిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+