ఫిబ్రవరి 24వరకు ఈ రాశుల కోసం కుబేరుడిని శాసిస్తానంటున్న కుజుడు

నవగ్రహాల్లో కీలకమైన కుజుడు వచ్చేనెల ఏడోతేదీన కర్కాటక రాశిలో తిరోగమనం చేస్తాడు. కుజుడు అలా వెనక్కి ప్రయాణించడం అనేది మూడు రాశులపై సంపదల వర్షం కురిపిస్తోంది. అరుదుగా జరిగే ఈ ప్రక్రియ వల్ల ఈ రాశులవారు ఎంతో లాభపడుతున్నారు. వీరికి ఆదాయం పెరగడంతోపాటు ఎన్నో శుభవార్తలను వింటారు. ఏయే రాశులవారికి కుజుడి తిరోగమనం ఏవిధంగా కలిసిరానుందనే విషయాలను, వివరాలను తెలుసుకుందాం.

కన్యారాశి
కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారు కొత్త కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఇందులో విజయం సాధించడమేకానీ అపజయం ఉండదు. ఉద్యోగులు చేసే కృషికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. ధైర్యంగా ఉంటారు. ఏ పనినైనా సహసంతో పూర్తిచేస్తారు. సంపద వచ్చిన తర్వాత దాన్ని పొదుపు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే అరుదైన అవకాశాలను, సానుకూల పరిణామాలను కోల్పోతారని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.

three zodiac signs will get golden life due to mars retrograde in cancer

తులా రాశి
ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతోపాటు మంచి ఆరోగ్యాన్ని కుజుడి తిరోగమనం ఇస్తుంది. డిసెంబరు ఏడోతేదీ నుంచి 80 రోజులపాటు వీరు పట్టుకుందల్లా బంగారమే. కొత్త అవకాశాలను గుర్తించుకుంటూ ముందుకు సాగాలి. మనసు భగవంతుడిపై లగ్నమవుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది. అందుకు మీ కష్టమే మిమ్మల్ని రాజులుగా చేస్తుంది.

మీనరాశి
వ్యాయామం చేయడం, యోగా, ధ్యానంతోపాటు సమతుల ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. జీవితంలో ఇంతవరకు ఊహించనిరీతిలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. విద్యతోపాటు ఇతర రంగాల్లో కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను విజయం వరిస్తుంది. ఫిబ్రవరి 24 వరకు కుజుడు వీరికి తిరుగులేని ఫలితాలను, డబ్బును ఇస్తున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+