గోవత్స ద్వాదశి, ధన్వంతరి జయంతి: ఒకేరోజు రెండు పండుగలు..
పెరిగి భరద్వాజునికి శిష్యుడయ్యాడు. ఆయుర్వేద విద్య నేర్చుకుని కాశీకి రాజు గా మారాడు అని ఒక కథ.
ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షం ద్వాదశిరోజు గోవత్స ద్వాదశి గా జరుపుకుంటారు. ఈ రోజున ఆవును పూజించడం విశేషం. పాలసముద్రంలో జన్మించినటువంటి సురభి అనే ఆవు, సబల అని దూడ తో కలిసి ఐశ్వర్యాన్ని దేవతలు ఇచ్చింది.
వేదంలోని ఎన్నో మంత్రాలు పశు సంపద యొక్క గొప్పతనాన్ని తెలియ జేశాయి. ప్రాచీనకాలంలో ధనానికి బదులుగా పశుసంపదను గొప్ప విషయంగా భావించేవారు ఈనాటి ధనవంతులు లాగా ఒకనాడు go మంతులు అనే పదం వినియోగంలో ఉండేది.
ఆవు నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి గోమూత్రము ఆవుపేడ మొదలైన పదార్థాలు పంచ గవ్యము లుగా పవిత్రతని అందిస్తాయి. వీటిని పూజించి తీర్థంగా స్వీకరించడం ఈ రోజు చేస్తారు. గోసంబంధమైన పదార్థాలను దానం చేయడం మినుము చేత చేసిన పిండివంటలను ప్రసాదంగా స్వీకరించడము ఈరోజు నియమాలు. పశువులకు ఉడకబెట్టిన ధాన్యాన్ని తినిపిస్తారు.

గోవును పూజించే పద్ధతి
ఆవుని సకలదేవాత్మకమగు భావించాలి. ఆవును దూడతో కలిసి నప్పుడు మాత్రమే పూజించాలి. నలుపు రంగు లేదా కపిల గోవును పూజిస్తే ఇంకా గొప్ప ఫలితం. అవును ఎప్పుడూ తోక దగ్గర మాత్రమే పూజించాలి. పూజించే ముందు ఆవుని శుభ్రంగా కడిగి అలంకరించి లక్ష్మీదేవిని పూజించిన విధంగా పసుపు కుంకుమల పువ్వులతో పూజించి. ఆవుకి గ్రాసాన్ని సమర్పించాలి.
ఆవుకి అరటి పండ్లు మొదలైన వాటికంటె ఆకుకూరలో గడ్డి తవుడు మొదలైనవి తినిపిస్తే మరింతప్రీతి చెందుతాయి. ఆవుని నింద చేసిన ఆవుని తన్నినా ఆ వంశం వృద్ధి చెందిందని దేవతల శాప వాక్కుగా చెబుతారు..
వివాహం కాని వారైన వివాహమైన వారైనా వితంతువైన బ్రహ్మచారులయినా అందరూ గో ప్రదక్షిణ చేయడానికి అర్హత కలిగిన వారే.
ధన్వంతరి జయంతి
రసాగరమథనంలో జన్మించిన విష్ణ్వాంశ సంభూతుడు ధనవంతునిగా చెప్పారు. దేవతలు రాక్షసులు కలిసి అమృతం పొందాలని క్షీర సాగరాన్ని మధిస్తే ఉన్న సందర్భంలో అనేక విలువైన వస్తువులు లభించాయి. అమృత భవనాన్ని కుడి చేతిలో పట్టుకుని పాలసముద్రంలో జన్మించినవాడు ధన్వంతరి. వేద మంత్రాలలో ధన్వంతరికి సంబంధించిన మంత్రాలు కూడా చెప్పబడ్డాయి.
మరొక కథ ప్రకారం ద్వాపరయుగంలో దీర్ఘతముడు అనే ఒక బ్రాహ్మణుడు తపస్సు చేస్తే అనుగ్రహించిన ధనవంతరి ఆయన కుమారుడిగా జన్మించాడు. అలా అనుగ్రహించిన ధన్వంతరి ఆశ్వీజమాసంలో బహుళ పక్షంలో ద్వాదశినాడు జన్మించాడు. పెరిగి భరద్వాజునికి శిష్యుడయ్యాడు. ఆయుర్వేద విద్య నేర్చుకుని కాశీకి రాజు గా మారాడు అని ఒక కథ.
ధన్వంతరి జయంతి రోజున ధన్వంతరి పూజ చేస్తే రోగ భయం ఉండదని ఒక ప్రతీతి.
ధన్వంతరి ప్రార్థన
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః












Click it and Unblock the Notifications