ప్రభాస్ 'ఫౌజీ' బిగ్ అప్డేట్.. టీజర్, ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ గా థియేటర్లలోకి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'రాజాసాబ్' చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 తదితర చిత్రాలను చేస్తున్నారు. అయితే సాధారణంగా ప్రభాస్ సినిమా అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆయన సినిమాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం సంబరపడిపోతుంటారు. ఇక టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ లాంటి సందర్భాల్లో అయితే ఆ కంటెంట్ క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ తో కొద్ది రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంటుంది.
అయితే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో 'ఫౌజీ' ఒకటి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫౌజీ మూవీని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ, బెంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ అప్డేట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫౌజీ మూవీ ఎలాంటి టీజర్, ట్రైలర్ లేకుండానే నేరుగా థియేటర్లలో విడుదలకు సిద్ధం కానుంది. ఇది వినడానికి షాకింగ్ గానే ఉన్నా ఇలాంటి పద్దతిలో రిలీజ్ చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. అయితే దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

ఫౌజీ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఇమాన్వీ నటించింది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ తదితర స్టార్ యాక్టర్స్ కీలక క్యారెక్టర్స్ లో అలరించనున్నారు. టాలెంటడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఫౌజీ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలను సమకూర్చగా మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫౌజీ మూవీ డిసెంబర్ 3 న విడుదల కానుంది. డిసెంబర్ 2న ప్రీమియర్స్ వేయనున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ మరో ఫిల్మ్ స్పిరిట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ మార్చి 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications