ఓటీటీని కుదిపేస్తున్న ‘రియల్ హారర్’ థ్రిల్లర్: మైండ్ గేమ్‌తో ఒళ్లు గగుర్పొడిచే కథ!

ప్రస్తుతం డిజిటల్ దునియాను ఓ సరికొత్త భయానక దృశ్య కావ్యం ఊపేస్తోంది! ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వందలాది సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టేసే కంటెంట్ రావడం అరుదు. అయితే, 'ది కంజురింగ్', 'ఇన్సిడియస్' వంటి మైండ్ బ్లాకింగ్ హారర్ చిత్రాల స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా.. చివరి క్షణం వరకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర్ ఒకటి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. అదే థాయ్‌లాండ్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ మూవీ 'డెత్ విస్పరర్ 3'.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ ఫా‍మ్స్ బ్లాక్
కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ ఫా‍మ్స్ బ్లాక్

నవల కాదు.. పక్కా రియల్ స్టోరీ!

ఈ సినిమాను మిగతా హారర్ చిత్రాల కంటే ప్రత్యేకంగా నిలిపేది ఇందులో ఉన్న 'రియాలిటీ'. ఈ ఫ్రాంచైజీలోని మొదటి రెండు భాగాలు ప్రసిద్ధ నవలల ఆధారంగా తెరకెక్కగా.. ఈ మూడో భాగాన్ని మాత్రం 1972లో చోటుచేసుకున్న ఓ రహస్యమైన, యథార్థ సంఘటన ఆధారంగా మలిచారు. 2 గంటల 8 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుడికి క్షణం కూడా పక్కకు తప్పుకోనివ్వని భయాందోళనను, సస్పెన్స్‌ను అందిస్తుంది. కథానాయకుడు 'యాక్', అతని ప్రాణానికి ప్రాణమైన సోదరి ఎంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంటుంది. ఆమె దారుణమైన అపహరణకు గురవుతుంది. తన చెల్లెలిని ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో యాక్ ఓ భయంకరమైన అన్వేషణను ప్రారంభిస్తాడు.

మగాళ్లతో పని లేదు.. ఇద్దరు అమ్మాయిల రొమాంటిక్ మూవీతో ఓటీటీ షేక్ !!
మగాళ్లతో పని లేదు.. ఇద్దరు అమ్మాయిల రొమాంటిక్ మూవీతో ఓటీటీ షేక్ !!
Death Whisperer 3 A real horror thriller taking the OTT world by storm story driven by mind games

భయానక గ్రామానికి చేరుకుంటాడు

ఆ ప్రయాణంలో అతడు.. దశాబ్దాలుగా దుష్టశక్తుల శాపానికి గురైన ఒక భయానక గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ కన్నులారా చూసే దృశ్యాలు, ఎదురయ్యే వికృతమైన ఆత్మలు, రాక్షస శక్తులతో అతడు చేసే పోరాటం ఒళ్లు గగుర్పొడుస్తుంది. యాక్ తన సోదరిని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఆ గ్రామం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

వెన్నులో వణుకు పుట్టించే బీజీఎం

కథానాయకుడిగా నడెక్ కుకిమియా తన నటనతో అదరగొట్టాడు. చెల్లెలిపై ప్రేమ, దుష్టశక్తులపై నరనరాన పొంగే ఆవేశం, భయం కలగలిపిన పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. సోదరి పాత్రలో నాచా జెస్సికా అలరించారు. ఇక ఈ సినిమాకు అసలైన గుండెకాయ 'బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ . ఒళ్లు గగుర్పొడిచే సౌండ్ డిజైన్, గుండెలు ఆగిపోయేలా వచ్చే జంప్-స్కేర్ సన్నివేశాలు హారర్ ప్రేమికులను పిచ్చెక్కిస్తాయి. మీరు కనుక మైండ్-బెండింగ్ సస్పెన్స్, ఒరిజినల్ హారర్ అనుభూతిని కోరుకునేవారైతే.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 'డెత్ విస్పరర్ 3'ని అస్సలు మిస్ కావద్దు. ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే పూర్తి చేసేదాకా లైట్లు కూడా ఆర్పలేరు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+