ఎటువైపు తలుపు ఉండాలి? ఎటువైపు తలుపును ఎక్కువగా వాడుకోవాలి?

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు, కట్టిన తర్వాత తలెత్తే కొన్ని వాస్తు దోషాలు, వాటి చుట్టూ వినిపించే భిన్నమైన అభిప్రాయాలు ఇంటి యజమానులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా గృహ నిర్మాణంలో తూర్పు, ఈశాన్య, నైరుతి దిశల ప్రాధాన్యతపై ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి కొన్ని ప్రధాన వాస్తు సమస్యలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు, ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుకుందాం.

స్థల పరిమితులు - ప్రత్యామ్నాయ మార్గాలు

చాలామంది ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసేలా స్థలాన్ని వదిలి, ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ వంటి కీలక నిర్మాణాలను వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. అయితే, తూర్పున ప్రధాన ద్వారం ఉన్నప్పటికీ, కొందరు సిద్ధాంతులు 'ఉత్తర దిశలో మరో గేటు' పెట్టమని సలహా ఇస్తుంటారు.కానీ ఆచరణలో ఉత్తరం వైపు పక్కవారి గోడ ఉండటం వల్లనో, లేదా స్థలం లేకపోవడం వల్లనో అక్కడ గేటు పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Vastu On which side should the door be located On which side should the door be used most frequently

తూర్పు వైపు ఉన్న మెయిన్ గేటునే ప్రధాన ద్వారంగా చేసుకుని, దాన్నే నిత్యం ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దక్షిణం వైపు రోడ్డు ఉన్నప్పుడు ఆ దిశను పూర్తిగా క్లోజ్ చేసి, కొంత స్థలాన్ని వదిలి ఫెన్సింగ్ వేయడం మంచిది. ఆ ఫెన్సింగ్ లోపల పచ్చని మొక్కలు లేదా చిన్నపాటి తోటను పెంచడం ద్వారా దక్షిణ దిశ నుండి వచ్చే ప్రతికూలతలను అడ్డుకోవచ్చు. ఇది వాస్తు పరంగానే కాకుండా ఇంటి అందాన్ని కూడా పెంచుతుంది.

కొత్త తలుపుల మార్పులు - అనుకోని ఇబ్బందులు

కొన్ని ఇళ్లలో (ముఖ్యంగా తూర్పు ముఖద్వారం ఉన్న ఇళ్లలో) సౌకర్యం కోసం లేదా అవసరం కొద్దీ పడమర వైపు కొత్తగా తలుపులు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఆ మార్పులు చేసినప్పటి నుంచే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని చాలామంది నమ్ముతుంటారు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం పడమర దిశలో తలుపు పెట్టడం అంతా తప్పు కాదు. అయితే అది ఏ మూలలో ఉందనేది ముఖ్యం. పడమర వాయువ్యంలో డోర్ ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు.

కానీ, అది పొరపాటున పడమర నైరుతి వైపునకు జరిగితే మాత్రం ఇంట్లో ప్రతికూల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టిన డోర్ పక్కన కానీ, ఎదురుగా కానీ కిటికీలు లేకపోతే ఇంటికి రావాల్సిన సహజసిద్ధమైన గాలి, వెలుతురు ఆగిపోతాయి. సైంటిఫిక్‌గా చూసినా ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా రాకపోతే మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+