• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నవరత్నాలు ఎందుకు ధరించాలి.. ఏ రాశుల వారు వేటిని పెట్టుకోవాలంటే?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

నవరత్నాలు అనేవి భూసంపద, జలసంపదల నుండి ఉద్భవిస్తాయి. భూమిలో పై పొర సుమారు 60 మైళ్లు ఉంటుంది. ఈ నాటికి భూమిలోనికి తవ్వగలిగిన గరిష్ఠదూరం 5 కి.|మీ మాత్రమే. భూమిలోనికి వెళ్లిన కొలది ఉష్ణోగ్రత పెరుగుతూ, ప్రతి 120 అడుగులకు 1 డిగ్రీ చొప్పున పెరుగుతుంది. ఇలా 30 మైళ్ల లోతులో 1200 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ అంతా ద్రవరూపంలో ఉంటుంది. అలా భూమిలోనికి వెళ్లినకొలది అనేక ఖనిజాలూ, రత్నాలూ ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

'స్వాతి ముత్యం' అంటే, స్వాతి కార్తెలో అంటే సూర్యుడు స్వాతి నక్షత్రంలో సంచరించే కాలంలో ముడుచుకొని ఉన్న ముత్యపు చిప్పలు తెరచుకుంటాయి. ఆ సమయంలో వర్షం ఆ చిప్పలలో చుక్కలుగా పడిన తర్వాత అవి ముడుచుకొంటాయి. ఇవి లోపల ఘనీభవించి ముత్యాలుగా ఏర్పడతాయి. వీటినే స్వాతి ముత్యాలంటారు.

రత్నధారణ, జ్యోతిష శాస్త్రాల అవినాభావ సంబంధం: - రత్నధారణ అనేది పూర్వకాలం నుండి జ్యోతిషశాస్త్రంతో ముడిపడి ఉంది. మానవశరీరంలో సప్తధాతువులు ఉంటాయి. అవి చర్మం, నాడులు, కొవ్వు, మాంసం, అస్థులు (ఎముకలు), ఉపస్థు, స్నాయువులు (సన్నని నరాలు). ఈ సప్తధాతువులకూ, సప్తవర్ణాలకూ, ప్రతి నిధులైన గ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. చర్మానికి శుక్రుడు, నాడీ మండలానికి బుధుడు, కొవ్వుకు గురుడు, మాంసానికి కుజుడు, ఎముకలకు శని, ఉపస్థుకు శుక్ర-కుజులు, స్నాయువుకు రవి-చం ద్రులు కారకులుగా నిర్ణయింపబడ్డారు. వ్యక్తికి ఏయే ధాతువులు క్షీణదశ వైపు పయనిస్తుంటాయో, వాటికి సమతుల్యత ఏర్పరచి, శారీరక-మానసికశక్తులను అభివృద్ధి పరుస్తాయి. జాతిరత్నాలలో 'దైవికశక్తులు' దాగుంటాయని మన పూర్వీకులు నిర్దేశించారు. మీ వ్యక్తిగత జాతక ఆధారంగా జ్యోతిష్యుల సలహా మేరకే ధరించగలరు, లేనిచో ఇబ్బందులు కలుగుతాయి.

 రవి (కెంపు) (మాణిక్యం):-

రవి (కెంపు) (మాణిక్యం):-

గుణం : సమర్థ ప్రభువు. ఇది ధరించినవారికి ఆయుర్వృద్ధి, ధనలాభం, అధికారం, ఉన్నతస్థితి, రోగనివారణ, మనోవికాసం కలుగుతాయి. ఇది ఎరుపు రంగుతో బాలసూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది.

ధాన్యం : గోధుమలు, శుద్ధికి : ఆవు పాలు, గంగాజలం

మంత్రం : ఓం దృణిః సూర్యాయ నమ:

 చంద్రుడు ('ముత్యం') (మౌక్తికం):-

చంద్రుడు ('ముత్యం') (మౌక్తికం):-

గుణం : రాణి. ఇది ధరించిన వారికీ వివాహం కానివారికీ త్వరలో వివాహం జరగటం, కుటుంబ, దాంపత్యానుకూలత, స్త్రీసౌఖ్యం, కార్యసిద్ధి, సంపదలు, ధనధాన్యవృద్ధి, మేహశాంతి కలుగుతాయి. గుండె జబ్బు రాదు. స్త్రీల పాలిట కామధేనువు వంటిది. ముత్యాలు తెల్లగా, స్వయంగా మెరుస్తుంటాయి.

ధాన్యం : బియ్యం, శుద్ధికి : సైంధవ లవణం, వరిపొట్టు (ధాన్యం పొట్టు).

మంత్రం : ఓం సోం సోమాయ నమ:

 కుజుడు (పగడం) - ప్రవాళం:-

కుజుడు (పగడం) - ప్రవాళం:-

గుణం : సేనానాయకుడు, ఉద్యమనాయకుడు. ఇది ధరించినవారికి శత్రుసంహారం, సాహసం, ధైర్యం చేకూరుతాయి. బుుణవిమోచనం, అధికారం, మాట చలాయింపు కలుగుతాయి. ఇది చిలుక ముక్కు రంగు, దొండ పండు రంగును పోలి ఉంటుంది.

ధాన్యం : కందులు. శుద్ధికి : ఆవు పాలు, కంకుమ నీరు, రక్తచందనం నీరు.

మంత్రం : ఓం అం అంగారకాయ నమ:

బుధుడు ( పచ్చ ) ( మరకతం - ఎమరాల్డ్‌ ):-

బుధుడు ( పచ్చ ) ( మరకతం - ఎమరాల్డ్‌ ):-

గుణం : తన వ్యాపారాలు తాను చూసుకునే తెలివైనవాడు. ఇది ధరించినవారికి జ్ఞాపకశక్తి, బుద్ధి చాతుర్యం కలిగి, నరాల ఒత్తిడి తగ్గుతుంది. విషదోషాలు హరిస్తుంది. ఉన్మాదం, పిచ్చి, దృష్టి దోషాలను పోగొడుతుంది. ఇది నెమలి పింఛం, గరిక చిగుళ్ల రంగులలో ఉండును.

ధాన్యం : పెసలు, శుద్ధికి : ఆవు మజ్జిగ, గోమూత్రం, పసుపు నీరు.

గురువు ( పుష్యరాగం ) (టోపాజ్‌) :

గురువు ( పుష్యరాగం ) (టోపాజ్‌) :

గుణం : తన మేధాశక్తితో ఇతరులకు మేలు చేసే ఆదర్శవాది. ఇది ధరించిన వారికి బుుణ విమోచనం, శత్రుజయం, ఉద్రేకం, ఆందోళన, తగ్గడం, పుత్రసంతానం, వంశవృద్ధి కలుగుతాయి. దీని రంగు బంగారు. లేత గులాబీ రంగులో ఉంటాయి.

ధాన్యం : సెనగలు, శుద్ధికి : ఉలువల గంజి, సెనగలు, ఉడికించిన నీరు.

మంత్రం : ఓం బృహస్పతయ నమ:

శుక్రుడు ( వజ్రం ) ( డైమండ్‌ ) :-

శుక్రుడు ( వజ్రం ) ( డైమండ్‌ ) :-

గుణం : తన మేధాశక్తితో తాను వృద్ధి చెందేవాడు. ఇది ధరించినవారికి నూతన తేజస్సు, కళ, ధన ధాన్య సంపదలు సంసార జీవితంలో అనుకూలత, సుఖం, స్త్రీలకు సుఖప్రసవం కలుగుతాయి. కలరా, ప్లేగు వ్యాధులు రావు. ఇది సహజమైన కాంతితో తేలికగానూ. తీర్చిన కోణాలతోనూ అందంగా కనిపిస్తుంది.

ధాన్యం : బొబ్బర్లు. శుద్ధికి : ఆవు పాలు, బియ్యం కడిగిన నీరు, బొబ్బర్లు ఉడికించిన నీరు.

మంత్రం : ఓం శుం శుక్రాయనమః||

శని ( నీలం ) ( సఫైర్‌ ) :-

శని ( నీలం ) ( సఫైర్‌ ) :-

గుణం : ఇతరుల ఆలోచనను ఆచరణలో పెట్టేవాడు. ఇది ధరించిన వారికి అపమృత్యు దోషాలు పోవటం, సంఘంలో గౌరవం, పలుకుబడి, ధనలాభం కలుగుతాయి. శని దోషాలు యావత్తూ తొలగును. ఇవి 3 రకాలు 1. ఇంద్రనీలం, 2. మహానీలం, 3. నీలమణి. ఇది నల్లని రంగు, నీలి ఆకాశం రంగు, నెమలి కంఠం రంగులతో ఉంటుంది.

ధాన్యం : నల్ల నువ్వులు, శుద్ధికి : నల్ల నువ్వుల నూనె, నీలిచెట్టు ఆకుల రసం, నల్ల ద్రాక్ష రసం.

మంత్రం ఓం శం శనైశ్చరాయనమ:

రాహువు ( గోమేదికం ) :-

రాహువు ( గోమేదికం ) :-

గుణం : ఆశాపరుడు ఇది ధరించిన వారికి నష్టద్రవ్యలాభం, స్త్రీ మూలంగా సహాయం, లాభం, వశీకరణ కలుగుతాయి, ఆవేదన తగ్గుతుంది. ఈ రాయి సహజమైన గోమూత్ర వర్ణం కలిగి ప్రకాశిస్తూ వుంటుంది.

ధాన్యం : మినుములు, శుద్ధికి మాదీఫలరసం, తేనే, గోమూత్రం.

మంత్రం : ఓం ఐం హ్రీం రాహవే నమ:

కేతువు ( వైడూర్యం ) ( కాట్స్‌ ఐ ) :-

కేతువు ( వైడూర్యం ) ( కాట్స్‌ ఐ ) :-

గుణం : తమోగుణం, నిరాశాపరుడు. ఇది ధరించిన వారికి. జ్ణానసిద్ది, మనోనిబ్బరం, సద్భావన, సజ్జన స్నేహము కల్గును.

ధాన్యం : ఉలవలు, శుద్ధికి : ఉలవ నీరు, తేనె, పంచ గవ్యములు, పంచామృతం

మంత్రం : ఓం ఐం హ్రీం కేతవే నమ:

English summary
Navarana has great importance in Astrology and Hindu culture. This story deals with Who and Why Navaratnas should wear?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X