వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యంత భక్తురాలు: రాధాకృష్ణులలో రాధ ఎవరు?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ.

 Who is Radha in radhakrishna?

బ్రహ్మ వస్తువు రూపగుణములులేని నిత్య సత్యము. జగత్తు నిత్యమూకాదు, సత్యమూ కాదు. దీని నిర్మాణమునకు ఆ నిర్గుణబ్రహ్మమునుండి పుట్టి అందులోనే లయమయ్యే రెండు తత్త్వములు కారణము. అవి పురుష స్త్రీ తత్త్వములు. మనమున్న 14 లోకముల బ్రహ్మాండ సృష్టికి మహావిష్ణువు అనే పురుషతత్త్వము, బ్రహ్మ, రుద్రుడు అనే మరిరెండు పురుష రూపములు, లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే స్త్రీ తత్త్వములు కారణము. ఈ సృష్టిలోని జీవులు ఈ త్రిమూర్తులను ఆరాధించి వరములు పొందుతారు. ఈ లోకములు కాక బ్రహ్మాండమందు గోలోకమనే లోకము ఉన్నది. ఈ లోకములో జీవులు నిత్యులు, ఆనంద స్వరూపులు. ఈ లోక పాలకులు రాధాకృష్ణులు.శుద్ధ ఆనందమైన బ్రహ్మ స్వరూపులు. ద్వాపరాంతమందు వీరే భూమియందు అవతరించినారు. వారి ఉపాసన వలన సర్వ కర్మాతీతమై ఏ కర్మఫలమూ కానటువంటి ఒకానొక ఆనందము మనకు లభిస్తుంది.

దేవీభాగవతం రాధాదేవి ఉపాసనను వివరిస్తుంది. గోలోకంలో రాధాకృష్ణులను దేవతలందరూ అర్చించారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, దుర్గ, మొదలైన వారందరూ దుర్గా మహోత్సవం జరిపినట్లు, పురాణ కథనం. బ్రహ్మకోరిక మేరకు శివుడు గానం చేయగా, ఆ గానరసంలో రాధాకృష్ణులు కరగి జలమై ప్రవహించారట. ఆ విధముగా గంగయే రాధ. శివుడు తిరిగి స్తుతించిన తరువాత రాధాకృష్ణుల దర్శనం అందరికీ లభించింది. ఈ గంగ భూలోకంలోని రాసమండలంలో ఉద్భవించినదనికూడా చెబుతారు. రాసమండలమంటే శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించిన వర్తులాకార స్థలము. దీని అంతరార్థము రాధాకృష్ణులు కేవలము రసమయ స్వరూపులు. వారి రస తత్త్వము అనురాగ జన్యమైన ఆనందము. భూమిపై అవతరించిన శ్రీకృష్ణుడు రాధయందు గోపికల యందు మానవాతీతమైన అనురాగమును కలిగించినాడు.

శ్రీకృష్ణుడు తన భార్యలందరినీ సమముగా ప్రేమించినాడు. అందులో ఆశ్చర్యమేమున్నది? అతడు సమస్త ప్రాణికోటినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. ఒక సారి కృష్ణుని భార్యలైన మిత్రవింద, కాళింది అనేవారికి ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? అనే సందేహము వచ్చింది. శ్రీకృష్ణుడంటే ఎక్కువ భక్తి కలిగినది రుక్మిణి అని ఎక్కువ ప్రేమ కలిగినది సత్యభామ అనీ వారి అనుమానము. వారినే వాళ్ళు అడిగారు. సత్య సమాధానం "భక్తి, ప్రేమలలో ప్రేమ ప్రధానం. అందరు భార్యలకంటె నేనే ఆయనకు ఇష్టము" అని ఆమె అన్నదట. రుక్మిణి ఇలాచెప్పినది. "ఆయనకు సమస్త జీవరాసులపై సమానమైన ప్రేమ.అట్టివారిలో నేనొకతెను." శ్రీకృష్ణుడు దక్షిణ నాయకుడు, భార్యలందరిపై సమాన ప్రేమ కలవాడు. సత్యభామ, రుక్మిణీ, రాధ వీరి ప్రేమలలో తేడా ఏమిటి? సత్యభామది భూతత్త్వము. ఆమె నిరంతరం ఆయన భౌతిక సాన్నిహిత్యము కోరుతుంది. ఇది తామసిక ప్రేమ. రుక్మిణి అతడు తనవద్దకు వచ్చినప్పుడు పూజిస్తుంది. అతడు దగ్గరలేనప్పుడు హృదయమందు ధ్యానిస్తుంది. ఇది రాజసిక ప్రేమ. రాధ ఎప్పుడూ కృష్ణుని సన్నిధిలోనే ఉన్నట్లు భావించుకుంటుంది. అతడు సన్నిహితముగా లేని భావనయే ఆమెకు ఉండదు. ఆమెది సాత్త్విక ప్రేమ. రాధాకృష్ణుల తత్త్వము అర్ధనారీశ్వర తత్త్వమే. ఒక నాణెమునకు కృష్ణుడు ఒకవైపు, రాధ మరియొకవైపు. వారు సనాతనులు.

రాధ అంటే ఎవరు !
ఒకరు ప్రియురాలు అని. మరికొందరు కృష్ణుని బంధువులు అని... వేరొకరు కన్నయ్యకు అత్త అని.. ఏవేవో ఉహాలు ...కానీ.... ఒక్క ధ్యాని సాధకుడు యోగి మాత్రమే కృష్ణ తత్వాన్ని గ్రహించ గలుగుతాడు .

ధ్యాన స్దితిలో సాధకుడుగా సత్యం ఏమిటి అని ఒక్క క్షణం పరికిస్తే.. రాధ అంటే భగవంతుని విశేషముగ ఆరాధించునది అని(భక్తీ అని ) అర్ధము.

అనగా అత్యంత భక్తురాలు.

రాధ : ధారా ............ అదో నిరంతర వాహిని

కుండలి నుండి మూలాదార వరకు జాలువారుతున్న అమృత బిందువులను ( విశ్వశక్తిని )

ధారలా భూలోకము నుండి ( మూలాధారా ) వైకుంఠము (సహస్రారం ) నకు తీసుకుని

వెళ్ళగలిగే ఒక శక్తి ... ధార .....రాధ ............. ఇదో నిరంతర వాహిని ...

ఇదే ధ్యానం ..........భక్తీ ......... ప్రేమ...............

కృష్ణుడనగా ఆకర్షించు వాడని యర్ధము:: నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మంటుంది

కాని మనం అత్మరాత్మ మాట వినం. ఇంద్రియాలు చెప్పినది చేస్తూ ఉంటాము ..

రాధ యనగా సిద్ధింప చేయునది అని అర్దము (మోక్షం )

కృష్ణ ( సాధకుడు ) ఎక్కడ ఉంటే ( నిరంతర ) ధార (రాధ ) అక్కడ ఉంటుంది .

నా దేహం వేరు ... నా శ్వాస వేరు అని చెప్పగలమా ?? లేదే

ఇరువురు ఒక్కటే ... ఇలా కృష్ణుని అంతరమైన స్వరూపము రాధగను,
బాహ్య రూపము పురుషుడినియు.

అలాగే రాధయొక్క అంతర్ స్వరూపము పురుషుడైన కృష్ణుని గాను,
బాహ్య స్వరూపము రాధ.

భగవాన్ కృష్ణ కోసం 16, ౦౦౦ మంది గోపికలు వచ్చారు ..

రాసలీలలు అని వ్యర్ద ప్రేలాపనలు చెపుతూ ఉంటారు .

యద్బావం తద్బభవతి వారిని మనం మార్చలేము ... కాని సత్యం మాత్రం ఇదే ............

ఎప్పుడు భాహ్య నేత్రాలతో చూడటమేనా ? ..
ఒక్కసారి అంతర్ముఖులమై మనో నేత్రంతో ఆత్మ స్దితిలో చుస్తే ...
పరమాత్ముని కోసం పరితపిస్తున్న జీవాత్మలు 16,౦౦౦..
నిరంతర ధ్యాన యజ్ఞంలో సమిధలుగా మారి
సత్య జ్ఞానాన్ని పొందిన (ఎరుక ) సిద్దులు .
వారు లక్ష్యం వెతుకులాట !
ఆ మహాచైతన్యం కోసం వెతుకులాట!
ఆ పరంధాముని కోసం వెతులాట .. !
ఆ వెతుకులాటలో ధ్యాన మార్గం చూపిన వాడు కృష్ణ
జ్ఞాన మార్గం చూపిన వాడు కృష్ణ
దేముడికి జీవుడికి ఉన్న బంధాన్ని ఎరుక పరచిన వాడు కృష్ణ
శోధన నుండి సాధన వైపు
సత్యాన్ని ఎరుక పరచిన వారు కృష్ణ .
ఆబాల గోపాలం అంతా సిద్దులు యోగులు తాపసులు
గోకులం అంటే వైకుంఠం అందులో భక్తీ అంటే రాధ
వైకుంఠం + ధ్యానం +కలిసి యున్నదే బృందావనం ..
కాపున బృందావనము అంటే ఓ సమూహం
జీవ సమూహము. ధ్యాన జీవుల సమూహం .
ఇకనైనా రాధ మాధవ తత్వాన్ని అర్ధం చేసుకుందాం.

English summary
RadhaKrishn are collectively known within Hinduism as the combined forms of feminine as well as the masculine realities of God.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X