నమో నారాయణ అనకుండా.. నమో వెంకటేశాయ అనడం సరైందేనా?

Subscribe to Oneindia Telugu

లోకులు కొందరు ఓం నమోనారాయణాయ! అనకుండా, ఓం నమో వెంకటేశాయ అంటున్నారు, ఇది న్యాయమా?
నారాయణా అంటున్నా, వెంకటేశా అంటున్నా అయ్యప్పా అని పిలిచినా న్యాయమే. ఎటొచ్చీ నిర్మలమైన మనస్సును దైవం మీద ఏకాగ్రం చేయడం ప్రధానం. ఏకాగ్రత లేకపోతే ఏ నామం జపించినా బూడిదలో పోసిన పన్నీరే. శ్రీరాముడు హనుమంతునికి దైవం, మరి రామునికెవరు?

రాముడికి రామశబ్దం దైవం ఫైళ్లి లంకలో సీతాదేవి ఉన్నదని తెలిశాక హనుమంతుడు నిప్పుపెట్టాడు కదా, మరి సీతాదేవి ఆ మంటలలో..?
ఈ ప్రశ్న సుందరకాండలో హనుమంతుడే వేసుకుని. ఔరా! ఆవేశం ఎంత దారుణాలకు దింపుతుందీ, గురువులను చంపిస్తుంది, సాధువులను హింసింప జేస్తుంది. అంతేనా, అది చేయించని పాడుపని ఏముంది - అని చింతిస్తాడు.

why pray in namo venkateshaya name?

అంతటివాడు ఆవేశానికి లొంగి ఎంతకు దిగాడో విన్నవారైనా క్రోధాన్ని ఎంత దూరంలో వుంచాలో గ్రహించడానికి సుందరకాండ చిన్ననాటి నుంచీ చదివిస్తే మన పిల్లలయినా వివేకంతో జీవిస్తారు.

దేవుడొక్కడే అంటూ ముక్కోటి దేవతలంటారేం?
ముక్కోటి ఆంధ్రులున్నప్పుడు అలా అనేవారు, ఇప్పుడు ఆరుకోట్ల దేవతలు. ప్రతి ప్రాణీ పరమాత్మ స్వరూపం అన్న నమ్మకం దీనికి కారణం! అది లేని వారికి ఏ బాధా లేదు, ఇందరు దేవతలేమిటా అనే చింత తప్ప!

స్వర్గం నరకం అంటే ఏమిటి?
మనం చేసే మంచి అంతా స్వర్గం, చెడుపనులన్నీ నరకం. కి సృష్టిలో చీకటి ముందు పుట్టెనా? వెలుగా?
లోకంబులు లోకేశులు లోకసులు తెగిన తుదిని అలోకంబగు
పెంజీకటికవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు
అన్నారు పోతన్నగారు. వెలుగుకీవల పెనుచీకటి సృష్టిలో ఉన్నది.

రాముడు, పరశురాముడు ఇద్దరూ అవతార పురుషులే కదా!
పరశురాముడు అంశావతారం. రాముడు పూర్ణావతారం అని పురాణాలు చెపుతున్నాయి. పూర్గావతారం వచ్చినప్పుడు అంశావతారం తాలూకు శక్తి లోపిస్తుంది. క్షి పార్టీలు ఫిరాయించేవారికి విభీషణుడు ముత్తాతయా? కొందరికి అకారణంగా కీర్తి లభిస్తుంది. అలానే కొందరి నెత్తి మీద అపకీర్తి పడుతుంది.

ఇలా అపకీర్తి పాలయినవాడు విభీషణుడు. పార్టీలు ఫిరాయించేవారికి సమాజ శ్రేయస్సు, దేశ సౌభాగ్యం అవసరం లేదు. వారికి పదవి లభించి పది కాంట్రాకులొచ్చే అవకాశం వస్తే చాలు, అలానే తమ పార్టీకి మరో పది సీటు వస్తే చాలు అనుకునేవారు ఈ స్వార్థపరుల కౌగిలిలో పడతారు. విభీషణుని విషయానికి వస్తేరాముని శక్తి తెలుసుకున్నాడు, జన్మలో ఏనాడూ దొంగచాటుగా పరదారను అపహరించని రావణుడు కపట సన్యాసి వేషంలో వెళ్ళినటు తెలిసిన నాడే లంకలో రాముడు కాలు పెడితే సర్వనాశనం అని గ్రహించి, ఆ విషయం రావణునికి బట్టబయలు చేసి, హితబోధ చేసి, అప్పుడు కదిలాడు.

విభీషణుడు రాముని శరణు వేడకపోతే లంకలో రావణ వంశం అంతరించి ఉండేది, అదొక వలస రాజ్యం అయేది. ఇప్పుడాలోచించండి. తన దేశాన్ని పరాయి పాలన నుండి రక్షించడానికి రాముని చేరిన విభీషణునికి, పదవి దొరకక పార్టీ ఫిరాయించే నాయకమ్మన్యులకూ భేదం! కి తెలుపు శుభానికీ, పవిత్రతకూ గుర్తు కదా, మరి వితంతువులు తెల్లని వస్త్రం ధరిస్తారేం? వారిని పవిత్రంగా ఉండమనీ, మనం పవిత్రంగా చూడాలనీ. కలియుగం తరువాత...? కృత, త్రేతా, ద్వాపరాల తరువాత కలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains on which name we have to pray the god in our daily life
Please Wait while comments are loading...