keyboard_backspace

Naga panchami 2021: విశిష్టత .. నాగ పంచమి పూజలతో విశేష ఫలితాలు

Google Oneindia TeluguNews

ఈరోజు నాగుల పంచమి పర్వదినం. అత్యంత భక్తి భావంతో నాగదేవతను పూజించే శుభదినం. ప్రతి సంవత్సరం అత్యంత పవిత్రమైన నాగుల పంచమి పర్వదినాన్ని శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజున నిర్వహిస్తారు. దీనినే గరుడ పంచమిగా కూడా జరుపుకుంటారు.ఇక ఈ సంవత్సరం ఆగష్టు 12, మధ్యాహ్నం 3.28 గంటలకు నాగ పంచమి వేడుకలు ప్రారంభమై ఆగష్టు 13, మధ్యాహ్నం 1.44 గంటలకు నాగుల పంచమి సమయం ముగుస్తుంది. నాగ పంచమి సందర్భంగా ముఖ్యంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి.

 శ్రావణ శుక్రవారం నాగుల పంచమి రావటం విశేషం

శ్రావణ శుక్రవారం నాగుల పంచమి రావటం విశేషం

ఈ సంవత్సరం పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు నాగుల పంచమి రావడం కూడా విశేషంగా చెబుతారు. మనదేశ సంస్కృతిలో నాగ దేవతకు పూజలు చేసే విధానం సాంప్రదాయంగా అనాదిగా ఆచారంలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేష శయనుడి పర్వమే ఈ నాగ పంచమి అని చెప్తారు . శివుడి మెడలో అలంకారమైన నాగదేవతను ఈ రోజు హిందువులు పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, నాగ దేవతతో పాటు శివుడిని ఆరాధించడం వలన ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. వివిధ నమ్మకాలు మరియు పురాణాల కారణంగా నాగదేవత కూడా మన దేశంలో పూజింపబడుతోంది.అనేకపురాణాలు సర్పాలతో మనకున్న సంబంధాన్ని చెప్తున్నాయి

 పౌరాణిక పుస్తకాలు సర్పాలతో..

పౌరాణిక పుస్తకాలు సర్పాలతో..

మహాభారతం, స్కంద పురాణం, నారద పురాణం, రామాయణం వంటి వివిధ పౌరాణిక పుస్తకాలు సర్పాలతో మనకున్న సంబంధంపై అనేక కథలను వివరించాయి. నాగ పంచమి రోజున పాములను పూజించడం వలన భక్తులకు మంచి అదృష్టం మరియు శ్రేయస్సు కలుగుతుందని గరుడ పురాణం పేర్కొంది. శివుడితో పాటు, కృష్ణుడు కూడా సర్పాలతో సంబంధం ఉన్న అనేక కథల ద్వారా హిందువులకు తెలుసు. శ్రీకృష్ణుడిని చంపడానికి కాంస కాళియా అనే సర్పాన్ని పంపినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు ఆ సర్పాన్ని ఓడించడమే కాకుండా దాని పడగపై నిలబడి వేణువు వాయించాడు.ఆ ఘట్టం అందరి మనస్సులో నిలిచిపోయిన ఘట్టంగా చెప్తారు.

దేశ వ్యాప్తంగా నాగ పంచమి వేడుకలు .. మహారాష్ట్రలో ప్రత్యేకం

దేశ వ్యాప్తంగా నాగ పంచమి వేడుకలు .. మహారాష్ట్రలో ప్రత్యేకం

నాగ పంచమిని దేశవ్యాప్తంగా జరుపుకున్నప్పటికీ, మహారాష్ట్రలో ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముంబై సమీపంలోని బత్తీస్ శిరాల గ్రామం నాగ పంచమి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. కాల సర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తులు, నాగ పంచమి రోజున నాగ దేవతను ఆరాధిస్తే వారు ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందే అవకాశం ఉందని నమ్ముతారు. నాగ పంచమి సర్వ శుభాలను కలిగిస్తుందని, నాగ దోషాలను తొలగిస్తుందని ఒక ప్రగాఢ విశ్వాసం .

నాగుల పంచమి పూజా విధానం ఇదే ..

నాగుల పంచమి పూజా విధానం ఇదే ..

ఇదిలా ఉంటే నాగ పంచమి రోజున ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు. దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పసుపు, కుంకుమ, గంధంతో పూజాధికాలు నిర్వహిస్తారు. దీపం వెలిగించి, అగరవత్తులు వెలిగించి నాగదేవతను మనసులో స్మరించుకుని భక్తిగా నమస్కరిస్తారు. కొందరు నాగ దేవత పుట్ట వద్ద నైవేద్యంగా పాలు పోస్తారు. నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉపవాస దీక్ష చేస్తారు. కొందరు తమ సన్నిహితులకు ఈ రోజు భోజనం పెడతారు.

నాగుల పంచమి నాడు పూజలు చేస్తే సర్వ శుభాలు

నాగుల పంచమి నాడు పూజలు చేస్తే సర్వ శుభాలు

మన సంస్కృతిలో భాగంగా మన జీవనంలో భాగమైన సర్పాలను పూజించిన వారికి ఎలాంటి కష్టాలు రావని చెప్తారు. నాగ దేవతను పూజించినవారికి ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని సవ్యంగా అనుకూలంగా ఉండేలా నాగదేవతలు దీవిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు భక్తులు. అందుకే నాగ పంచమి రోజున ప్రముఖ ఆలయాలన్నీ భక్తజన కోటితో కిటకిటలాడతాయి .అత్యంత భక్తిభావంతో , ఉపవాస దీక్షతో నాగదేవతను భక్తులు పూజిస్తారు.

English summary
Naga Panchami is celebrated every year in Sravana masam according to Telugu Hindu Calendar
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X