వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వర్ణాంధ్రకు డ్వాక్రా చేయూత
హైదరాబాద్ : డ్వాక్రా మహిళలు స్ధానిక సంస్ధల ఎన్నికలలో పోటీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. స్ధానిక సంస్ధల ఎన్నికలలో పోటీ చేయటం ద్వారా గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు డ్వాక్రా మహిళలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం నాడు ఒంగోలు, తిరుపతిలో నిర్వహించిన డ్వాక్రా సంఘాల ప్రాంతీయ చైతన్య సదస్సుల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మహిళలు గత 50 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని డ్వాక్రా మహిళలు కేవలం 5సంవత్సరాలలో సాధించారని ఆయన అభినందించారు. డ్వాక్రా గ్రూపుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ సదు పాయాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
డ్వాక్రా గ్రూపు మహిళలు బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధనకోసం ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్లకోసం తెలుగుదేశం పోరాడుతుందని ఆయన చెప్పారు. ఒంగోలులో కోస్తా జిల్లాల డ్వాక్రా మహిళా సంఘాలు, తిరుపతిలో రాయలసీమ జిల్లాల డ్వాక్రా మహిళా సంఘాల సదస్సు జరిగింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!