మే 29 నుంచి లక్ష్మీనారాయణ రాజయోగం: మిథునరాశి, ధనుస్సు రాశి, కన్యారాశివారికి తిరుగులేదు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంటాయి. తాజాగా మే నెలలో రెండు కీలక గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడబోతోంది. తెలివితేటలకు కారకుడైన బుధుడు, సంపద, భోగభాగ్యాలకు, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు ఒకే రాశిలో అంటే మిథునంలో కలవడం వల్ల ఈ అద్భుత యోగం సిద్ధిస్తుంది.

మే 14న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 29న బుధుడు కూడా మిథున రాశిలోకి అడుగుపెడతాడు. సరిగ్గా మే 29 నుంచి ఈ యోగం పూర్తిస్థాయిలో ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా, కోటీశ్వరులయ్యే యోగం కూడా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Lakshmi Narayana Raja Yoga Begins May 29 Unstoppable Success for Gemini Sagittarius and Virgo

మిథున రాశి

ఈ రాజయోగం మీ సొంత రాశిలోనే ఏర్పడటం వల్ల మీకు తిరుగులేని విజయాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని పదోన్నతులు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న రుణ సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వరంలా మారబోతోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు రెట్టింపు అవుతాయి. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఇది సరైన సమయం. కార్యాలయంలో మీ బాస్ నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు పొందుతారు. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సమయం బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. పాత ఉద్యోగాల్లో జీతాల పెరుగుదలతో పాటు, కొత్తగా ఉద్యోగ వేటలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరుతుంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఈ రాజయోగ ఫలితాలు మరింత మెరుగ్గా అందాలంటే.. లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం, బుధవారం నాడు పచ్చ గడ్డిని ఆవుకు తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+