బాలయ్య-కొరటాల ప్రాజెక్ట్‌కు బిగ్ షాక్!
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకోవాల్సి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'NBK112' ప్రస్తుతం అనిశ్చితిలో పడినట్లు టాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాను అట్టహాసంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించినప్పటికీ.. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే పలు అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను అభిమానులను కొంత అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఈ భారీ ప్రాజెక్టు నిలిచిపోవడానికి లేదా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆర్థిక లెక్కలేనని తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాలని ప్రారంభంలో ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ప్రాజెక్టు స్థాయిని దృష్టిలో ఉంచుకుని అంతపెద్ద మొత్తంలో ఆర్ఖిక రిస్క్ తీసుకోవడానికి బాలకృష్ణ సంకోచిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌ను కొంత తగ్గించి కథలో మార్పులు చేర్పులు చేసి సినిమాను పునఃరూపకల్పన చేయడంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

అయితే బడ్జెట్ ఒక్కటే సమస్య కాకపోవచ్చు. బాలకృష్ణ, కొరటాల శివల మధ్య సృజనాత్మక విభేదాలు కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. బహిరంగంగా బడ్జెట్ సమస్యలను ప్రస్తావిస్తున్నప్పటికీ.. హీరో, దర్శకుడి మధ్య సరైన సృజనాత్మక సమన్వయం లేకపోవడమే అసలు పెద్ద సమస్య కావచ్చని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందనే వార్తలపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రంతో దర్శకుడు బాక్సాఫీస్ విజయాన్ని అందించిన నేపథ్యంలో NBK112పై నెలకొన్న అనిశ్చితి ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన తర్వా, ఈ చిత్రం ఒక మామూలు సినిమా అని చాలా మంది ప్రేక్షకులు విమర్శించడంతో, ఇది తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైంది. అయినప్పటికీ వాణిజ్యపరంగా 'దేవర' ఒక హిట్‌గా పరిగణించబడేంత మంచి ప్రదర్శన కనబరిచింది. కొరటాల శివ ఒకప్పుడు టాలీవుడ్‌లో అత్యంత నమ్మకమైన దర్శకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలు వాణిజ్యపరమైన విజయాన్ని, బలమైన స్టార్ చిత్రాలను అందించగల దర్శకుడిగా ఆయనను నిలబెట్టాయి.
అయితే 'ఆచార్య' సినిమా ఘోర పరాజయం ఆ అభిప్రాయాన్ని నాశనం చేసింది. తన పాత కీర్తిని పునరుద్ధరించుకోవడానికి కొరటాలకు ఓ నిఖార్చయిన మాస్ హిట్ అవసరం. ఇలాంటి సమయంలో NBK112 ప్రాజెక్టుపై అనిశ్చితి నెలకొనడం ఆయన కెరీర్‌కు మరో పరీక్షగా మారే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications