ఓటీటీలోకి బోల్డ్ టీనేజ్ డ్రామా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?

ఈ రోజుల్లో ఓ సినిమాపై బజ్ ఏర్పడటానికి ఒక్క పోస్టర్ చాలు.. సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఓ సినిమాను ప్రొమోట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. పోస్టర్ లేదా టీజర్ తో సినిమాపై ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. అలా ఓ చిన్న టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన మూవీ 'హుషార్ పిట్టలు' ఈ మూవీ నుంచి గతంలో వచ్చిన బోల్డ్ టీజర్ సినిమాపై యువతలో ఆసక్తిని పెంచింది. అలాగే పాటలు, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఆగస్టు 15 న విడుదలైంది. ఈ బోల్డ్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా యూత్ కు కనెక్ట్ అయింది. యూత్ ఫుల్ రొమాన్స్‌ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కూడా ఈ మూవీ అందించింది.

థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న 'హుషార్ పిట్టలు' మూవీని బిక్షు అనే నూతన దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. బోల్డ్ కథాంశం, టీనేజ్ రిలేషన్‌ షిప్స్ ను చక్కగా స్క్రీన్ పైకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక కొత్త జంట అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అందుకే ఈ మూవీకి కుర్రాళ్లు జై కొడుతున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 3 నుంచి 4 వారాల తర్వాత అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక హుషార్ పిట్టలు స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ తెలంగాణలో జరుగుతుంది. ఈ స్టోరీ రవి (అన్షు), పుట్ట చిట్టి (వాసవి గణేషన్) అనే ఇద్దరు టీనేజర్ల చుట్టూ తిరుగుతుంది. చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ఉండే రవి.. స్నేహితులు చూపించిన అశ్లీల వీడియోల కారణంగా చదువుపై ఆసక్తి తగ్గిపోయి అమ్మాయిల వెంట పడతాడు. అదే సమయంలో 9 వ తరగతి చదివే చిట్టి.. రవిని చూసి అతనివైపు ఆకర్షితురాలు అవుతుంది. అయితే ఓ రోజు అనుకోకుండా ఇద్దరూ ఒకే గదిలో అసభ్యంగా ఉన్న సమయంలో తల్లిదండ్రులకు దొరుకుతారు.

HusharuPittalu Latest bold teenage drama comes to Amazon Prime streaming first week of September

అలాంటి సందర్భంలో తమ పిల్లలను చూసిన పేరెంట్స్‌ ఎలాంటి క్షోభను అనుభవించారు..? పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలు ఏంటి..? చిన్న వయసులోనే ఆకర్షణకు లోనై చేసిన తప్పుల కారణంగా వాళ్ల జీవితాలు ఎలా మారాయి..? అనేదే మిగతా కథ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+